సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ..ఎంతమంది హీరోయిన్ లు ఉన్న కలిసి వర్క్ చేసిన కొందరు హీరోయిన్స్ కొందరు హీరోస్ కి బాగా సెట్ అవుతూ ఉంటారు. నిజజీవితంలో వాళ్ళు పెళ్లి చేసుకోకపోయినా సరే వాళ్ళ జంట అద్భుతంగా ఉంటుంది.  అయితే అలాంటి జంటలలో ఒకరే ప్రభాస్ - అనుష్క . వీళ్ళు ప్రేమించుకుంటున్నారా..? పెళ్లి చేసుకుంటున్నారా..? అన్న విషయాలు పక్కన పెడితే . వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అని కోట్లాదిమంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు . వీళ్ళ పెళ్లి ముహూర్తం కోసం పడి కాపులు కాస్తున్నారు.


అయితే మా మధ్య అలాంటిది ఏదీ లేదురా బాబోయ్ ..మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వీళ్ళు నెత్తి నోరు మొత్తుకున్న ఆ విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. 2024 నవంబర్లో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఒక న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.  ఆ మాటకొస్తే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి , మరి ముఖ్యంగా హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ ఎప్పటినుంచో మనం వింటూనే ఉంటున్నాం . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటీ పర్సనల్ లైఫ్ పబ్లిక్ లో పెట్టేస్తున్నారు .



రీసెంట్గా ప్రభాస్ - అనుష్కలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . ప్రభాస్ ని అందరం ముద్దుగా డార్లింగ్ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. అది అందరికీ తెలిసిందే . అలాంటి డార్లింగ్ ప్రభాస్ ఫోన్లో హీరోయిన్ అనుష్క పేరు ఏం నేమ్ తో సేవ్ చేసుకున్నాడో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు . వీళ్లిద్దరూ చాలా చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ..అంతకు మించిన ఫ్రెండ్షిప్ కూడా వీళ్ళ మధ్యనే ఉంది .



అయితే ప్రభాస్ తన ఫోన్లో అనుష్క నేమ్ నీ "స్వీటు" అంటూ సేవ్ చేసుకున్నారట.  ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో డార్లింగ్ ప్రభాస్ నే స్వయంగా చెప్పుకోరావడం విశేషం.  అంతే కాదు రెబల్ ఫ్యామిలీకి అనుష్క చాలా చాలా క్లోజ్ గా కూడా ఉంటుందట.  ప్రభాస్ ఫ్యామిలీలో జరిగే ఏ ఫంక్షన్ కి అనుష్క అస్సలు మిస్ అవ్వదట . కృష్ణం రాజు గారు బ్రతికున్నప్పుడు కూడా అనుష్కను బయట అమ్మాయిల కాకుండా సొంత ఇంటి అమ్మాయిలానే ట్రీట్ చేశారట.  చూద్దాం మరి ప్రభాస్ - అనుష్కల బంధం ఎంతవరకు వెళ్తుందో..? కేవలం ఫ్రెండ్షిప్ తోనే ఆగిపోతుందో ..? అంతకు మించిన స్థాయికి ముందుకు వెళ్తుందో .. తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: