ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా ఏకంగా నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. మరి ఆ నాలుగు సినిమాలు ఏవి ? వాటి పరిస్థితి బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంది అనే వివరాలు తెలుసుకుందాం.

ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా మొదటగా తమిళ డబ్బింగ్ సినిమా అయినటువంటి వెట్టాయన్ తెలుగు బాక్సాఫీస్ దగ్గర విడుదల అయింది. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడమే థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ స్థాయి కలెక్షన్లను వసూలు చేయడం లేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి కలెక్షన్లను ప్రస్తుతం వసూలు చేయలేకపోతోంది.

సుధీర్ బాబు తాజాగా మా నాన్న సూపర్ హీరో అనే సినిమాలో హీరోగా నటించాడు ఈ మూవీ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 11వ తేదీన విడుదల అయింది ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లను రాబట్టడం లేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి సుహాస్ తాజాగా జనక అయితే గనక అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీని దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 12 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్స్ ను ఈ మూవీ విడుదలకు ముందే ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్స్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కానీ ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను మాత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర రాబట్టడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: