అయితే ఇలా కమేడియన్ గా కొనసాగిన సమయంలో ఆయనలో ఏకంగా ఒక గొప్ప దర్శకుడు దాగి ఉన్నాడు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ బలగం అనే సినిమాను తీసి ఇండస్ట్రీ చూపును మొత్తం తన వైపుకు తిప్పుకోగలిగాడు వేణు. ఇక ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాకు ప్రపంచ స్థాయి అవార్డులు కూడా రావడంతో వేణు ప్రతిభా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. సాధారణంగా ఒక డైరెక్టర్ ఒక హిట్ సినిమాలు తీసిన తర్వాత.. నెక్స్ట్ సినిమాని అంతకుమించి హిట్ అయ్యేలా చూసుకోవాలి.
ఈ క్రమంలోనే బలగం సినిమాతో సెన్సేషనల్ విజయాన్ని సాధించిన వేణు కూడా. తన తర్వాత సినిమా విషయంలో ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఎల్లమ్మ అనే సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యం ఉన్న కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట.ఇలాంటి సినిమాలో హీరోగా ఎవరిని తీసుకోబోతున్నారు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. కాగా ఎల్లమ్మ కథను పలువురు హీరోలకు వినిపించాడట వేణు. నానికి కథ వినిపించగా కథ నచ్చినప్పటికీ అప్పటికే తెలంగాణ నేపథ్యంలో దసరా సినిమా తీయడంతో ఈ సినిమా ఒప్పుకోలేదట. ఆ తర్వాత తేజ సజ్జకు వినిపించగా అంత పెద్ద పాత్ర తన వల్ల కాదు అన్నాడట.