తమిళ సినీ పరిశ్రమంలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా వెట్టాయన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. అక్టోబర్ 10 వ తేదీన ఈ మూవీని థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి ఈ 5 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి తమిళనాడు ఏరియాలో 78.60 కోట్ల కలెక్షన్లు రాగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.40 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక ఏరియాలో 18.70 కోట్ల కలెక్షన్లు రాగా , కేరళ లో 13.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.40 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్ సీస్ లో 66.85 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకి 97 కోట్ల షేర్ కలక్షన్లు రాగా ... 198.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా మరో 65 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్గా నటించగా ... దగ్గుపాటి రానా , అమితా బచ్చన్ , పహద్ ఫాజిల్ , రితికా సింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: