ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత జోష్లో సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ సంస్థ ఒకటి. ఈ సంస్థ వారు వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారే కానీ ఈ సినిమాలతో వీరు పెద్ద స్థాయి విజయాలను మాత్రం అందుకోవడం లేదు. ఇక విరు 2023 మరియు 2024 సంవత్సరాలలో కలిపి 11 సినిమాలలో ఇన్వాల్వ్ అయ్యారు. మరి వీరు నిర్మించిన, డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు ఏవి. వాటి ద్వారావిరు ఎలాంటి విజయాలను అందుకున్నారు అనే వివరాలను తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం ఈ బ్యానర్ వారు ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే సినిమాను నిర్మించింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈ బ్యానర్ వారు టక్కర్ అనే సినిమాను నిర్మించారు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం అందుకోలేదు. ఆ తర్వాత ఈ బ్యానర్ వారు ఆది పురుష్ మూవీ ని తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ మూవీ ద్వారా కూడా వీరికి నష్టాలే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బ్యానర్ వారు బ్రో అనే సినిమాను నిర్మించారు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని సాధించలేదు. ఇక ఈ బ్యానర్ వారు కొంత కాలం గతం రామబాణం అనే సినిమాను నిర్మించారు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. 

ఈ బ్యానర్ వారు బబుల్ గమ్ అనే సినిమాను నిర్మించారు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. అలాగే ఈ బ్యానర్ వారు నిర్మించిన ఈగల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది ఈ బ్యానర్ వారు నిర్మించడం మనమే సినిమా పర్వాలేదు అనే విజయాన్ని అందుకుంది. ఈ బ్యానర్ వారు నిర్మించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ బ్యానర్ వారు నిర్మించిన స్వాగ్ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ బ్యానర్ వారు నిర్మించిన విశ్వం సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఈ సినిమా కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకునే అవకాశాలు ప్రస్తుతానికి కనబడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pmf