ఎన్టీఆర్ ఇలా రాసుకుంటూ.. దేవర సినిమా మొదటి భాగానికి అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. ఈ చిత్రంలో నటించిన సహానటులైన సైఫ్ అలీ ఖాన్, జాన్వీ, శ్రీకాంత్ ప్రకాష్ రాజు గారికి ఇతర నటీనటులకు తన హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తెలిపారు. తమ పాత్రలకు ప్రాణం పోసి మరి తమ సినిమాకు ప్రాణం పోసేలా చేశారని అలాగే డైరెక్టర్ కొరటాల శివకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాంటి కథను సృష్టించి ఆయన దిశా నిర్దేశంతోనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లి విజయ్వంతంగా నిలిచామంటూ తెలిపారు.
అలాగే అనిరుద్ సంగీతం రత్నవేలు సార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఆకట్టుకున్నాయి ఈ చిత్రానికి సంబంధించిన వాటన్నిటిలో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు అంటూ తెలిపారు. అలాగే తమ సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన థియేటర్ యజమానులకు కూడా ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్. దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. నిర్మాతలకు కూడా తెలిపారు. గత నెల రోజులుగా దేవర చిత్రం అంటి ఒక పండుగలా జరిగింది ఇలా చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు చేస్తున్నాను అంటూ తెలిపారు. మీరు చూపించే ఈ అభిమానం తనని ఈ స్థాయికి తీసుకు వచ్చిందని.. అభిమానులు ఎప్పుడూ కూడా గర్వపడే సినిమాలే తీయడానికే ప్రయత్నిస్తూ ఉంటాను అంటూ తెలిపారు ఎన్టీఆర్. మీరే దేవర చిత్రాన్ని మీ భుజాల మీద మోసి ఇంతటి విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు అంటూ తెలిపారు ఎన్టీఆర్.. అయితే ఎన్టీఆర్ స్పెషల్ నోట్ ఒక వర్గం వారికి నచ్చలేదు..గతంలో ఎన్టీఆర్ ని విమర్శించిన వారు అలాగే ఒక రాజకీయ పార్టీ తాము లేనిదే ఎన్టీఆర్ సినిమాలు ఆడలేవు అనేట్టుగా విర్రవీగారు.. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ఎవరి సపోర్టు లేకుండా తన అభిమానుల సపోర్టుతోనే సక్సెస్ అయ్యిందనీ తెలియజేస్తున్నారు అభిమానులు.