మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... అంజలి , సునీల్ , నవీన్ చంద్ర , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ జె సూర్య ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇకపోతే ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితం వరకు ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమా డిసెంబర్ 20 వ తేదీన విడుదల కావడం కష్టం అనే వార్తలు కూడా అనేకం తెరపైకి వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా డిసెంబర్ 20 వ తేదీన కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 20 వ తేదీ నుండి జనవరి 10 వ తేదీకి పోస్ట్ పోన్ కావడంతో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన మ్యాజిక్ సినిమాను డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది చిన్న సినిమా అయినప్పటికీ దీనికి గౌతమ్ తిన్ననూరి ఈ మూవీ కి దర్శకత్వం వహించడం , అలాగే ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించడంతో కొంత మంది జనాలు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. గేమ్ చేంజర్ సినిమా పోస్ట్ పోవడం కావడంతో మ్యాజిక్ సినిమాను డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరి మ్యాజిక్ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: