మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలలో కొంత మంది ఏదైనా సినిమా బాగా నచ్చితే అది చిన్న సినిమా అయినా పర్లేదు దానిని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలా ప్రమోట్ చేయడం ద్వారా చిన్న సినిమాలకు పెద్ద స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే చిన్న సినిమాలను బాగా ఎంకరేజ్ చేసే టాలీవుడ్ స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఈయన కెరియర్లో ఇప్పటివరకు చాలా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు.

ఈయన తాజాగా "క" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు   మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఒక ఈవెంట్ ను నిర్వహించింది. అందులో భాగంగా ఈ సినిమా హీరో అయినటువంటి కిరణ్ మాట్లాడుతూ ... అల్లు అర్జున్ మా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజు మా సినిమా సెట్ కి వచ్చారు. నాతో మాట్లాడారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని నాతో అన్నారు. ఇక సినిమా షూటింగ్ లాస్ట్ డే కూడా అల్లు అర్జున్ గారు మా సినిమా సెట్ కి వచ్చారు.

ఆ రోజు కూడా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని ఆయన నాతో అన్నారు. అలా అల్లు అర్జున్ గారు "క" సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజు మరియు పూర్తి అయిన రోజు నన్ను కలిసారు ... నాతో మాట్లాడారు అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం "క" మూవీపై  తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: