•హై ఇంటెలిజెన్స్ సన్నివేశాలు.. కానీ ప్రేక్షకులకు ఎక్కలేదు
•చెత్త సినిమా.. గత్యంతరం లేక రామ్ చరణ్ మూవీ గద్దె..
టాలీవుడ్ లో సంక్రాంతి సంబరం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు పోటీ పడితే ఏ హీరో సినిమా పై చేయి సాధిస్తుంది..? ఏ హీరో సినిమా సూపర్ హిట్ అవుతుంది..? ఏ హీరో సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వస్తాయి..? అన్న ఆసక్తి అటు టాలీవుడ్ వర్గాలతో పాటు ఇటు సినీ అభిమానులలోను సహజంగానే ఉంటుంది. ఈ క్రమంలోనే 2014 సంక్రాంతి కానుకగా ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అప్పటికే మూడు వరస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో జోరు మీద ఉన్న మహేష్ బాబు నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ అదిరిపోయే కథ కథనాలతో చాలా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే తో వన్ సినిమా తెరకెక్కించారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ మహేష్ కు జోడీగా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ఊహలకు అందని విధంగా ప్రేక్షకుల ఆలోచనలకు భిన్నంగా ఉండడంతో ఎవరికి ఎక్కలేదు. ఇక మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమా కూడా సంక్రాంతికి వచ్చింది. రామ్ చరణ్ కు జోడీ గా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే అల్లు అర్జున్ కాజల్ అతిథి పాత్రలలో కనిపించారు. దిల్ రాజు నిర్మాత కాగా వంశీ పైడిపల్లి దర్శకుడు..
పరమ రొటీన్ కథాంశంతో మాస్ మసాలా యాక్షన్ సినిమాగా ఎవడు సినిమా తెరకెక్కింది. ఎవడు సినిమా పరమ రొటీన్ అయినా వన్ సినిమా ప్రేక్షకులకు ఎక్కలేదు కాబట్టి ఆ సంక్రాంతికి ప్రేక్షకులు గత్యంతరం లేక ఎవడు సినిమాను ఆదరించారు. అలా 2014 సంక్రాంతి విన్నర్ గా మహేష్ బాబు పై చేయి సాధించి రామ్ చరణ్ విజేతగా నిలిచారు