సమరసింహారెడ్డి సినిమాకు అప్పట్లోనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు అప్పట్లో టికెట్లు దొరకడం కూడా కష్టమైంది. 5 రూపాయల టికెట్ రేట్లతోనే అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. చిరంజీవిపై బాలయ్య పైచేయి సాధించడంతో పాటు కొన్ని నెలల క్రితం ఈ సినిమా రీ రిలీజ్ కాగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత రోజుల్లో సైతం చిరంజీవి, బాలయ్య సినిమాలు పలు సందర్భాల్లో పోటీ పడ్డాయి.
బాలయ్య కెరీర్ లో ఎన్ని విజయాలు ఉన్నా సమరసింహారెడ్డి సినిమా ప్రత్యేకం అని చెప్పవచ్చు. బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ కు ఇప్పట్లో కూడా క్రేజ్ బాగానే ఉన్నా ఈ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు అయితే లేవని చెప్పవచ్చు. బి.గోపాల్ తన సినీ కెరీర్ లో తక్కువ సినిమాలే తెరకెక్కించినా మెజారిటీ సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.
బాలయ్య రెమ్యునరేషన్ పరంగా ఒకింత టాప్ లో ఉన్నారు. ఒక్కో సినిమాకు 35 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అండుకుంటున్న బాలయ్య ప్రకటించిన తర్వాత సినిమాలు సైతం క్రేజీ ప్రాజెక్ట్ లు అనే సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో గ్యాప్ లేకుండా బిజీగా ఉన్న బాలయ్య కెరీర్ పరంగా భారీ విజయాలు దక్కడానికి తన వంతు కష్టపడుతున్నారు.