సినిమా ఇండస్ట్రీ అంటేనే పుకార్లకు, గాసిప్పులకు , ఎఫైర్లకు పెట్టింది పేరు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది పై చాలా దారుణమైన రూమర్లు వినిపిస్తూ ఉంటాయి. చాలామంది డేటింగ్ విషయంలో, ప్రేమ విషయంలో ఎన్నో గాసిప్పులు మనం వింటూ ఉంటాం. హీరోల కంటే హీరోయిన్ల విషయంలో ఈ గాసిప్పులు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఓ హీరోయిన్ స్టార్ హీరోని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని.. ఐదు కోట్ల ఇల్లు గిఫ్ట్ గా తీసుకుంది అన్న రూమర్ అప్పట్లో మీడియాని ఒక కుదుపు కుదిపేసింది. ఆ హీరోయిన్ ఎవరో ? కాదు నాగార్జున హీరోగా నటించిన శివమణి సినిమాలో హీరోయిన్గా నటించిన ఆసిన్. మలయాళం లోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రాణించింది.
తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాక బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ గజినీ సినిమాలోను హీరోయిన్గా నటించింది. తెలుగులో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఘర్షణ, శివమణి, చక్రం, గజినీ, దశావతారం, అన్నవరం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. దాదాపు 8 భాషలు అనర్గంగా మాట్లాడుతుంది. ఆమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు.. సల్మాన్ ఖాన్‌ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని.. ఇందుకు సల్మాన్ రూ.5 కోట్ల ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చాడు అన్న పుకార్లు వినిపించాయి. అయితే ఈ వార్త గురించి ఆశిన్ క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరిని పెళ్లి చేసుకోలేదు.. ఎవరి దగ్గర ఇల్లు గిఫ్ట్ గా తీసుకోలేదు.. అని చెప్పింది. ఈ రోమర్స్ బాలీవుడ్ లో వినిపించాక.. సల్మాన్ ఓ రోజు ఫన్నీగా ఇల్లు ఎలా ఉంది అని అన్నారట. ఆ తర్వాత ఆశిన్ 2016లో మైక్రోమ్యాక్స్ కో ఫౌండర్ అయిన రాహుల్ శర్మని పెళ్లాడింది. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది.