•భారీ అంచనాల మధ్య బోల్తాపడ్డ ఎన్టీఆర్ కథానాయకుడు
 
•అటు రామ్ చరణ్ కి కూడా తప్పని తిప్పలు

•2019 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద విక్టరీ సాధించిన వెంకటేష్, వరుణ్ తేజ్


టాలీవుడ్ లో 2019 సంక్రాంతి కానుకగా ఒకటి రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డాయి. నందమూరి నటసింహం, బాలకృష్ణ నటించిన తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా అలాగే బోయపాటి శ్రీను , రామ్ చరణ్ కాంబినేషన్లో వినయ విధేయ రామ, దిల్ రాజు బ్యానర్లో అనిల్ రావు పూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసిన నటించిన మల్టీ స్టారర్ ఎఫ్2 రిలీజ్ అయ్యాయి.  


వాస్తవంగా చూస్తే కథానాయకుడు , వినయ విధేయ రామ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ  ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అనుకున్నట్టు గానే ఈ ఎఫ్2 సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎఫ్2 భారీ వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే 2019 సంక్రాంతి విన్నర్ గా బాలయ్య , రామ్ చరణ్ పై సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ , కుర్ర హీరో వరుణ్ తేజ్ పై చేయి సాధించారు.


వాస్తవానికి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా అనగానే ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ లీనమైపోయి నటిస్తారు అని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా  సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పైగా బాలకృష్ణ ఆ టైంలో విమర్శలు కూడా ఎదుర్కొన్నట్లు సమాచారం. ఇక మరొకవైపు క్లాసిక్ మూవీగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించకపోవడం గమనార్హం. ఫన్ టు ఫ్రస్టేషన్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్2 సినిమా మాత్రం కామెడీ పరంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  ఈ సినిమా హిట్ అవడంతో అటు విక్టరీ వెంకటేష్ ,ఇటు వరుణ్ తేజ్ ఇద్దరు కూడా సక్సెస్ అందుకున్నారు. మొత్తానికి అయితే 2019 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద విక్టరీ సాధించి విజయోత్సవం జరుపుకున్నారు వెంకటేష్..

మరింత సమాచారం తెలుసుకోండి: