- చిన్న చిత్రంగా వచ్చి పెద్ద హిట్..
- బాలకృష్ణ కి షాక్ ఇచ్చిన రవితేజ..
- మిరపకాయ్ దాటికి కొట్టుకుపోయిన  సిద్ధార్థ్,సుమంత్..


 సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు ప్రజలకు పండగ వాతావరణమే కాకుండా సినీ ఇండస్ట్రీ వారికి కూడా ప్రత్యేక సినిమా పండగ వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చింది అంటే కోళ్ల పందాలు,పిండి వంటలు,  ధాన్యరాశులు, ముగ్గులు,గొబ్బెమ్మలు ఇలా  దాదాపు మూడు రోజులపాటు పండగ ఎంతో అట్టహాసంగా సాగుతుంది. అలాంటి పండుగ సందర్భంగా చాలామంది  సొంత ఊర్లకు వెళ్లి ఆనందంగా  పండగను ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఈ పండుగ సందర్భంలో అనేక సినిమాలను కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ కాదు. అందులో ప్రేక్షకుల ఆదరణ ఏది పొందుతుందో ఆ చిత్రమే సూపర్ హిట్ అవుతుంది. మరి 2011 సంక్రాంతి బరిలో నిలిచి, సూపర్ హిట్ అయిన కొన్ని చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 2011 సంక్రాంతి హిట్:
 2011 జనవరి 29వ తేదీన హీరో బాలకృష్ణ చేసినటువంటి పరమవీరచక్ర చిత్రం రిలీజ్ అయింది. జనవరి 13 రోజున రవితేజ హీరోగా వచ్చిన మిరపకాయ్ రిలీజ్ అయింది. జనవరి 14వ తేదీన అనగనగా ఓ ధీరుడు,గోల్కొండ హై స్కూల్ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఈ నాలుగు సినిమాల మధ్య ఏర్పడినటువంటి విపరీతమైనటువంటి పోటీలో  రవితేజ హీరోగా చేసినటువంటి మిరపకాయ్ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. 2011 సంక్రాంతి బరిలో ఈ చిత్రం గురించి అందరూ మాట్లాడుకున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రం  యాక్షన్ కామెడీ కథాంశంతో రూపొందింది. ఇందులో రవితేజ యాక్టింగ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.  రవితేజ టైమింగ్ కామెడీ మాస్ యాక్షన్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. మొత్తం ఈ చిత్రం 113 సెంటర్స్ లో 50 రోజులకు పైగా ఆడింది.  ఇందులో రవితేజ సరసన కథానాయికగా రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేత్ లు చేశారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్  ప్రధాన విలన్ గా వచ్చినటువంటి ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. అలాంటి ఈ చిత్రానికి పోటీగా వచ్చినటువంటి  అనగనగా ఓ ధీరుడు, గోల్కొండ హై స్కూల్, బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాలన్నింటినీ దాటి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. మొత్తం 25.04 కోట్లు వసూలు చేసి  బయ్యర్లకు మంచి లాభాలను అందించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం తర్వాత రవితేజ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: