నరసింహ నాయుడు నైజాం హక్కులు కేవలం 2 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అప్పట్లో ఈ సినిమా పరిమిత సంఖ్యలో థియేటర్లలో విడుదలైంది. తర్వాత రోజుల్లో ఈ సినిమాకు థియేటర్ల కౌంట్ పెరిగి రికార్డ్ స్థాయిలో లాభాలు వచ్చాయి. అయితే ఇతర సినిమాలతో పోల్చి చూస్తే నరసింహ నాయుడు సినిమాకు బెటర్ టాక్ రావడం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు. నరసింహ నాయుడు సినిమాలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించడం జరిగింది.
బాలయ్య, సిమ్రాన్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద హిట్ కాంబినేషన్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. బాలయ్య, సిమ్రాన్ కాంబోలో తర్వాత రోజుల్లో సైతం ఎక్కువ సంఖ్యలో సినిమాలు రావడం గమనార్హం. చివరిగా ఈ కాంబినేషన్ లో ఒక్క మగాడు సినిమా తెరెకక్కగా ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. బాలయ్య ప్రస్తుతం బాబీ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు.
బాలయ్య బాబీ కాంబో మూవీ సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. బాలయ్య బాబీ కాంబో మూవీ బడ్జెట్ విషయంలో మేకర్స్ అయితే రాజీ పడటం లేదు. ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు అవుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ తో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య ప్రస్తుతం సీనియర్ హీరోలలో టాప్ లో ఉన్నారు.