* ఇద్దరు సినిమాలు డిసప్పాయింట్ చేశాయి
* 2005 సంక్రాంతి పండుగ వేళ చిన్న హీరోలదే హవా
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ సినిమాలో రిలీజ్ అవుతుంటాయి ఈ పండగ వేల సినిమాలను రిలీజ్ చేసి కలెక్షన్లను ఎక్కువగా సాధించాలని దర్శక నిర్మాతలు హీరోలు భావిస్తారు. 2005లో కూడా సంక్రాంతి బరిలోకి బడా హీరోల సినిమాలు దిగాయి. వాటిలో కొన్ని హిట్ అయ్యాయి. మరికొన్ని మాత్రం ఫ్లాప్ అయ్యాయి. 2005 సంక్రాంతి సందర్భంగా జనవరి 6న మొదటగా విడుదలైన యాక్షన్ డ్రామా ఫిల్మ్ "బాలు: ఏబీసీడీఈఎఫ్". దీనికి ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, శ్రియ, నేహా ఒబెరాయ్, గుల్షన్ గ్రోవర్ నటించారు.
బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా ఫ్రెష్ లుక్‌లో కనిపించి మెప్పించాడు. యాక్షన్ రొమాన్స్ కామెడీ వంటి ఎలిమెంట్స్ తో ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఇందులోని పాటలు హిట్ అయ్యాయి కానీ సినిమా యావరేజ్ గానే నిలిచింది. బుల్లితెరపై మాత్రం ఈ మూవీ సూపర్ హిట్. ఇది ఎప్పుడు వచ్చినా దీన్ని ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారు.
జనవరి 14 సంక్రాంతి కానుకగా విడుదలైన "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనికి ఐదు మంది అవార్డులు కూడా వచ్చాయి. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాను ప్రభుదేవా డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రంలో శ్రీహరి, త్రిష, సిద్ధార్థ్‌లు ప్రధాన పాత్రలో నటించారు. త్రిష, సిద్ధార్థ్ కెమిస్ట్రీ బాగా పండింది. నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ సినిమా మొత్తానికే హైలైట్ అయింది. ఈ మూవీ స్టోరీ చాలా బాగుండటంతో తొమ్మిది భాషల్లో దీనిని రీమేక్ కూడా చేశారు. 2005 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మిగతా అన్ని సినిమాలకు బాగా పోటీని ఇచ్చింది. అదే ఆ కాలంలో ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది.
2005, జనవరి 14వ తేదీనే యాక్షన్ కామెడీ చిత్రం "నా అల్లుడు" విడుదలైంది. ఇందులో జూ.ఎన్టీఆర్, రమ్యకృష్ణ, శ్రియ, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటించారు. వి.విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీకి స్టోరీ అందించాడు. వర ముళ్లపూడి దర్శకత్వం వహించాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాంబుగా నిలిచింది. 2005 సంక్రాంతి సందర్భంగా జనవరి 21వ తేదీన రిలీజ్ అయిన "ఎవడి గోల వాడిది" సినిమా 100 రోజులు ఆడి అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఇందులో ఆర్యన్ రాజేష్ హీరో కానీ చాలా కామెడీ ఉండటం వల్ల ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.