* వాల్తేరు వీరయ్యతో చిరు సందడి
* వీర సింహారెడ్డితో సంక్రాంతి జోష్‌ తెచ్చిన బాలయ్య
* వారసుడిగా తెలుగులోకి విజయ్‌ ఎంట్రీ
* సంక్రాంతికి అజిత్‌ తెగింపు



టాలీవుడ్ ఇండస్ట్రీలో.. చాలా సినిమాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలు ప్రతి శుక్రవారం లేదా ఏదైనా పండుగ చూసుకొని రిలీజ్ చేస్తారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో దసరా అలాగే సంక్రాంతి పండుగకు... చాలా సినిమా రిలీజ్ అవుతాయి. ముఖ్యంగా సంక్రాంతికి.. పందెం కోళ్ల లాగా సినిమాలు పోటీ పడతాయి. అయితే 2023 సంక్రాంతి పండుగ సమయంలో....  ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు వచ్చాయి.

అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, అటు నందమూరి బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలు. ఇక తమిళ్ హీరోలువిజయ్ చేసిన వారసుడు, అజిత్ చేసిన తూనీవు  సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలిచాయి. అయితే వీటన్నిటిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. ఎక్కువ కలెక్షన్లను రాబట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో కామెడీ అలాగే.. చిరంజీవి తో పాటు రవితేజ ఉండటంతో సినిమా బంపర్ హిట్ అమ్ముతుంది.

 2023 సంక్రాంతి బరిలో నిలిచిన వాల్తేరు వీరయ్య  బడ్జెట్ 1040 కోట్లు అయితే...  236.15 కోట్లు కలెక్షన్లు రాబట్టగలిగింది. ఇక బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వీరసింహారెడ్డి వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ 110 కోట్లు అయితే... 134 కోట్లు రాబట్టగలిగింది. అయితే ఫ్యాక్షనిజం ఓవర్ గా ఉండడంతో సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి ప్రభావం ఈ సినిమాపై పడ్డట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

 ఇక అదే సంక్రాంతి సమయంలో తూనీవు..  తెలుగులో తెగింపు కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా తమిళంలో బంపర్ హిట్ కాగా... మన తెలుగులో థియేటర్లు తక్కువ ఉన్న నేపథ్యంలో పెద్దగా ఆడలేదు. ఇక తమిళ్ హీరో విజయ్ నేరుగా తెలుగులో చేసిన మొదటి వారసుడు. ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్లో వచ్చింది. పెద్ద హీరోల సినిమాలు ఉన్నప్పటికీ.. దాదాపు 300 కోట్లు రాబట్టగలిగింది.  అయితే ఇది తెలుగు అలాగే తమిళం ఇండస్ట్రీలో కలిపి అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: