* 'హిట్లర్'గా మెగాస్టార్ కూడా సక్సెస్.!
* పాపం వెంకీకి కలిసిరాని సంక్రాతి.!
(టాలీవుడ్-ఇండియాహెరాల్డ్): మెగాస్టార్ చిరంజీవి,ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో నటించిన వహించిన యాక్షన్ డ్రామా చిత్రం 'హిట్లర్'.ఈ చిత్రం మెగాస్టార్లోని మరోకోణాన్ని బయటపెట్టింది. అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని కళ్లకు కట్టిపడేసేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.ఈ మూవీ 4 జనవరి 1997న విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. అప్పటికే వరుస బాక్సాఫీస్ ఫ్లాప్‌లతో ఉన్న మెగాస్టార్ కి మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఈ మూవీ 1996లో వచ్చిన మలయాళ చిత్రం మరియు బయటి ప్రపంచం నుండి తన ఐదుగురు సోదరీమణులను కాపలాగా ఉంచే అధిక రక్షణ కలిగిన సోదరుడి కథను చెబుతుంది.చిరు నటించిన ఈ చిత్రంలో అతి ప్రేమ చూపించిన అన్నయ్యను సొంత చెల్లెళ్ళే దూరం పెట్టడం చేయడంతో చిరు పండించిన పాత్ర ప్రేక్షకులను భవిద్వేగానికి గురి చేసింది. మొదట్లో ఈ మూవీ అవేరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికి విడుదలైన వారం తర్వాత మంచి పేరు తెచ్చుకుంది.
అయితే మెగాస్టార్ అన్నచెల్లెళ్ళ అనుబంధం గూర్చి చెప్తే అదే సంవత్సరం జనవరి 10 న నటసింహం నందమూరి బాలయ్య 'పెద్దన్నయ్య' బరిలో దిగారు.తెలుగు చిత్రసీమలో ద్విపాత్రాభినయంతో అపురూప విజయాలు చూసిన ఘనత నిస్సందేహంగా నటరత్న యన్.టి.రామారావుకే దక్కుతుంది. ఆ తరువాతి తరంలో ఆయన నటవారసుడు బాలకృష్ణ అదే తీరున సాగారు. డ్యుయల్ రోల్ లో బ్లాక్ బస్టర్స్ చూసిన బాలకృష్ణ పాతికేళ్ళ క్రితం సంక్రాంతి కానుకగా వచ్చి, సందడిచేసిన పెద్దన్నయ్యలోనూ బాలయ్య తనదైన అభినయంతో అన్నదమ్ములుగా నటించి అలరించారు. 1997 జనవరి 10న విడుదలైన పెద్దన్నయ్య చిత్రం ఆ నాటి పొంగల్ హంగామాలో అత్యధిక వసూళ్ళు చూసిన చిత్రంగా నిలచింది. రామకృష్ణా హార్టీ కల్చరల్ స్టూడియోస్ పతాకంపై నందమూరి రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి శరత్ దర్శకత్వం వహించారు.1997 సంక్రాంతికి జనం ముందు నిలచిన అన్ని చిత్రాల్లోకి పెద్దన్నయ్య బిగ్ హిట్ గా నిలచింది.
విక్టరీ వెంకటేష్ కూడా 'పెద్దన్నయ్య' మూవీ విడుదల రోజే 'చిన్నబ్బాయి' అంటూ బరిలోకి దిగారు అయితే అప్పటికే ముందు సంవత్సరం వరుస విజయాలతో దూసుకుపోతున్న విక్టరీకి చిన్నబ్బాయి మూవీ భారీ షాక్ ఇచ్చింది. బాలయ్య, మెగాస్టార్ దెబ్బకి విక్టరీ మూవీ అడ్రస్ లేకుండా పోయింది.రాశి మూవీస్ పతాకంపై ఎం. నరసింహరావు నిర్మాణ సారథ్యంలో కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, రమ్యకృష్ణ,రవళి నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు. తర్వాత కాలేజ్ గలాట పేరుతో తమిళంలోకి అనువాదం కూడా చేశారు.ఏదేమైనా 1997 సంక్రాతి అనేది బాలయ్య కు ఫుల్ మీల్స్ లాగా మెగాస్టార్ కు సెమీ మీల్స్ లాగా విక్టరీకి మాత్రం విషంలాగా వారి వారి సినీ జీవితాల్లో అదొక ముద్రగా మిగిలిపోయింది అని చెప్పవచ్చు.