స్టార్ స్టేటస్ వచ్చాక ఏ హీరోయిన్ ని కూడా తమ సినిమాలో వద్దు అంటూ ఏ హీరో కూడా చెప్పరు . అలా జరిగేది చాలా చాలా రేర్ సందర్భాలలోనే.  కానీ అనుష్క విషయంలో ఒక స్టార్ హీరో అలా చేశాడు. అది కూడా అనుష్క అంటే పడి చచ్చిపోయే హీరో. కోట్లాది మంది ఫ్యాన్స్ ఎప్పుడు ఎప్పుడు ఈ కాంబో సెట్ అవుతుందా అని వెయిట్ చేసే హిట్ కాంబో. యస్.. తన సినిమాలో వద్దు అంటూ  మేకర్స్ కి ఓ హీరో చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది .


అంతే కాదు ఆ విషయాన్ని బాగా హైలెట్ చేశారు అనుష్క ఫ్యాన్స్ . ఆ హీరో మరెవరో కాదు "ప్రభాస్". ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే.  మరి ముఖ్యంగా ప్రభాస్ అన్ని విషయాలలోనూ స్ట్రాంగ్ గా డెసీషన్స్ తీసుకుంటూ ఉంటారు.  ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ద డిజాస్టర్ గా నిలచిన సినిమా "రెబెల్". ఈ సినిమా పై సొంత ఫ్యాన్స్ కూడా నెగిటివ్ గా మాట్లాడారు.



ఈ సినిమాలో దీక్ష సెధ్ , తమన్నా హీరోయిన్లు గా నటించారు. నిజానికి దీక్షా సేధ్ పాత్రలో ముందుగా అనుష్క శెట్టి ని అనుకున్నాడట రాఘవ లారెన్స్.  అయితే ఆమె ఈ పాత్రకి సూట్ కాదు అంటూ రెబెల్ స్టార్ ముందుగానే చెప్పేసారట.  ఆమె ఈ సినిమాలో హీరోయిన్గా వద్దు అంటూ కూడా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారట . ఆ కారణంగానే  అనుష్క ఒక డిజాస్టర్ నుంచి తప్పించుకోగలిగింది. అప్పట్లో ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోయారు . అనుష్క అంటే ఎంత ఇష్టమో అంటూ వీరి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: