ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2.. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో  ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గ్లోబల్ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. పుష్ప 2 తో మరింత పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు..పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 6 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది..అయితే ఈ సినిమా ఇప్పటికే  విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇదిలా ఉంటే  ఈ సినిమా నుంచి విడుదల చేసిన సాంగ్స్, టీజర్ సినిమాపై భారీ స్థాయి లో అంచనాలను పెంచేసాయి.తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పుష్ప 2 సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

ఈనెల 19న దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు.. ఈ సందర్భంగా ఆయన పుష్ప 2 గురించి చెబుతూ పుష్ప 2 ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే తాను ఫస్ట్ ఆఫ్ చూసినట్లుగా తెలిపారు.అందులో ప్రతి సీనుకు దిమ్మతిరిగి పోవాల్సిందే అంత అద్భుతంగా సినిమా వచ్చిందని దేవిశ్రీ తెలిపారు.  ఈ సినిమా షూటింగుకు ముందే సుకుమార్ గారు నాకు ఈ సినిమా కథ చెప్పారు. అప్పుడే చాలా బాగా నచ్చింది ఆయన చెప్పిన విధంగానే ఈ సినిమాని చేశారని దేవి శ్రీ తెలిపారు.. పుష్ప 2 లో ప్రతి సీన్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని దేవిశ్రీ తెలిపారు..ఐకాన్ స్టార్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ తో అదరగొట్టారని దేవిశ్రీ తెలిపారు. త్వరలోనే ఈ సినిమా నుంచి స్టన్నింగ్ వస్తున్నట్లు దేవిశ్రీ హింట్ ఇచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: