( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో విమర్శలు,  అంతకుమించి ఆరోగ్య సమస్యలు, అన్నింటిని దిగమింగుకొని , ఇప్పుడే ధైర్యంగా బయటకు వచ్చిన సమంత సినిమాలు చేయడానికి సిద్ధమైంది. సమంత సినిమాలు తో పాటు వెబ్ సిరీస్ లో కూడా చాలా సెలెక్టివ్ గా చేసుకుంటూ ప్రస్తుతం బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన సితాటిల్, హనీ బన్నీ వెబ్ సిరీస్ లు అమెజాన్ లు స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆమె మంచి కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉంది.


ఇక తన సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రలాల మూవీంగ్ పిక్చర్స్  బ్యానర్ పై ఇప్పటికే మా ఇంటి బంగారం అనే సినిమా ను నిర్మిస్తుంది సమంత. తాజా గా ఇప్పుడు మరో సినిమా ను నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమా లో ఆమె హీరోయిన్గా నటించ‌బోతుంది అని కూడా అంటున్నారు.  అయితే ఈ సినిమా లో ఆమె యంగ్ హీరో ప్రియదర్శి తో రొమాన్స్ చేసేందుకు రెడీ అయినట్లు కూడా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .  అయితే సమంత , ప్రియదర్శి తో కలిసి నటిస్తుంద నే వార్త ప్రస్తుతం అభిమానుల్లో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది .


ఇప్పటికే ప్రియదర్శి ఒక పక్క కమెడియన్ గా , హీరో గా సెలెక్టివ్‌ సినిమాల తో టాలీవుడ్ లోనే త‌న‌కంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు . ఇప్పుడు సమంత తో ప్రియదర్శి కలిసి  నటిస్తే ఆయన క్రేజ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది . సమంత కూడా తన బ్యానర్ పై మరిన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతుంది. ఇక మరి మీరు ఇద్దరి కాంబినేషన్లో నిజంగానే సినిమా వస్తుందా లేదా అనేది తెలియాలంటే అధికార ప్రార్ధన వచ్చేవరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: