విషయం ఏమంటే... బీపీ డౌన్ అవ్వడం, చెమటలు పట్టడంతో రకుల్ తీవ్ర అస్వస్థతకు గురైంది! అనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ గాయపడిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. వివరాల్లోకి వెళితే, వర్కౌట్ సెషన్‌లో ఆమె 80 కిలోల డెడ్‌లిఫ్ట్ ను పైకి ఎత్తగా వీపుకు గాయమైంది. పాక్షికంగా వెన్నపూస పై ఆ బరువు పడడంతో ఆమె తీవ్ర అస్వస్థతకి గురైంది. నడుముకు ఎలాంటి సేప్టీ బెల్డ్ ధరించకుండా చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో వారానికి పైగా బెడ్ రెస్ట్ లోనే ఉంది. ఇపుడిపుడే క్రమంగా కోలుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే నొప్పి నుంచి ఉపశమనం లభించడంతో రకుల్ దేదే పర్యార్ దే2 షూటింగ్ కి యధావిధిగా హాజరైందని వార్తలు వస్తున్నాయి. అయితే నొప్పి రోజు రోజుకి ఎక్కువ అవ్వడంతో ఫిజియో థెరపీ మొదలు పెట్టిందట. ప్రతీ మూడు.. నాలుగు గంటలకు ఒకసారి మళ్లీ నొప్పి వచ్చేదిట. ఈ క్రమంలో అక్టోబర్ 10 రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ కావడంతో సెలబ్రేషన్లకు రెడీ అయింది. పుట్టినరోజు పార్టీకి ఒక గంట ముందు వీపు గాయం కారణంగా చాలా ఇబ్బంది పడిందిట పాపం రకుల్. గాయం కారణంగా రకుల్ L4, L5, S1 నరాలు జామ్ అయ్యాయట. బీపీ డౌన్ అవ్వడంతో ఒళ్లంతా చెమటలు పట్టడంతో ఆమెని మంచం మీద పడుకోబెట్టి ప్రాధమిక చికిత్స అందించారుట. ఒంట్లో నలతగా ఉన్నా? రోజూ చిన్న పాటి వ్యాయామాలైన చేయనిదే రకుల్ డే గడవదని సన్ని హితులు చెబుతున్నారు. అలా చేయడం కూడా అనారోగ్యానికి దారి తీసిందని డాక్టర్స్ అంటున్నారు మరి!