తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు . ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు . ఆ తర్వాత ఈయన చాలా విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో పవన్ సినిమా ల్లో నటించడం కంటే కూడా రాజకీయాల్లో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు సినిమాలకు కమిట్ అయి ఉన్నాడు. ఆ మూడు సినిమాలను తిరిగి పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం కల వ్యక్తి అనే విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈయన తాను నటించిన కొన్ని సినిమాలలోని యాక్షన్స్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ కూడా చేసినట్లు తెలుస్తోంది.

మరి ముఖ్యంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బద్రి , ఖుషి , జానీ సినిమాలలో మంచి యాక్షన్స్ సన్నివేషాలు ఉంటాయి. ఈ మూడు మూవీ లలోని చాలా యాక్షన్స్ సన్నివేషాలను పవన్ కళ్యాణ్ కొరియో గ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం పవన్ , సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన కొన్ని యాక్షన్స్ సన్నివేషాలు ఉన్నట్లు అందులో కొన్ని సన్నివేశాలను పాన్ స్వయంగా కొరియో గ్రఫీ చేసినట్లు కూడా ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: