అవును, మీరు విన్నది నిజమే. నేచురల్ స్టార్ నాని ప్రభాస్ హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధ పడిపోయాడు. ప్రస్తుతం తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కడంతో క్రేజీ కాంబినేషన్లో సినిమాలు ఇక్కడ తయారవుతున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో ఇప్పుడు ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికి ఒక్కో భాష నుంచి ఒక్కో హీరో లేదా హీరోయిన్స్ ని తీసుకోవడం పరిపాటిగా మారింది. ఇలా ఊహించని కలయికలు జరుగుతూ ఉండే క్రమంలో మన తెలుగు దర్శకులతో బాలీవుడ్ హీరోలు సినిమాలు చెయ్యాలని తహతహలాడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

మరోపక్క బాలీవుడ్ హాట్ భామలు కూడా తెలుగు సినిమాలలో పని చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా ఇటీవల జాన్వీ కపూర్, నోరా ఫతేహి లాంటి హాట్ సెన్సేషనల్ హీరోయిన్స్ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. అయితే, అలా వచ్చిన స్టార్ హీరోయిన్ లలో ఓ నటి ఇప్పుడు తెలుగులో రెండో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు... బాలీవుడ్ లో ఇటీవల సంచలన విజయం సాధించిన యంగ్ బ్యూటీ శ్రద్ధ దాస్. మరి ఈమె నటించిన స్త్రీ 2 హిందీలో ఏకంగా 860 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కొత్త ట్రాక్ రికార్డ్ సెట్ చేసిన సంగతి తెలిసినదే.

ఇలాంటి హీరోయిన్ ని ఇప్పుడు మన టాలీవుడ్ మేకర్స్ లైన్ లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె టాలీవుడ్ మోస్ట్ ప్రాఫిటబుల్ యంగ్ హీరో నాని సరసన నటించబోతోంది తెలుస్తోంది. శ్రద్దా కపూర్ పేరు చెప్పగానే మన యంగ్ హీరో నాని ఒకే చేసాడని వార్తలు వస్తున్నాయి. నాని తెలుగులో 100 కోట్ల హీరోగా అవతరించిన సంగతి విదితమే. కాగా ఈ క్రేజీ కలయిక ప్రస్తుతానికి చర్చల్లో ఉందట. ఈ సినిమాకి యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక శ్రద్దా కపూర్ ఆల్రెడీ తెలుగులో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సాహో అనే భారీ యాక్షన్ ప్రాజెక్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ ఓకే అయితే ఈ సినిమా తర్వాత ఆమె చేసే రెండో సినిమా నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లోనే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: