పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో అనేక సినిమాలను రిజెక్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలలో చాలా మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే పవన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మొదట బద్రి అనే మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. బద్రి సినిమా విషయంలో జరిగిన కొన్ని విషయాల గురించి పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ ఒక రోజు ఉదయం నాలుగో గంటలకు బద్రి సినిమా కథను వినడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఉదయం 8 గంటల వరకు వింటూనే ఉన్నాడు. సినిమా కథ మొత్తం పూర్తి అయ్యాక క్లైమాక్స్ నచ్చలేదు అన్నాడు. దానితో నేను క్లైమాక్స్ సరిగా వినలేదేమో అని మళ్లీ ఒక సారి చెప్పాను. నువ్వు చెప్పింది సరిగానే విన్నాను. కానీ నాకు క్లైమాక్స్ అంతగా నచ్చలేదు. కాస్త మార్చి తీసుకురా అన్నాడు. దానితో నేను కొంత టైమ్ తీసుకుని చాలా వర్షన్ లను రాశాను.

కానీ అది ఏది నాకు నచ్చడం లేదు. దానితో ఒక రోజు పవన్ ఫోన్ చేశాడు. నేను వెళ్లి మళ్ళీ ముందు చెప్పిన క్లైమాక్స్ నే మరింత బ్రీఫ్ గా వినిపించాను. దానితో పవన్ ఆ రోజు ఇదే చెప్పావు కదా అన్నాడు. నేను మీరు చెప్పారు అని చాలా వర్షన్ లను క్లైమాక్స్ కోసం రాశాను. కానీ ఏది నాకు నచ్చడం లేదు. అందుకే మీరు సరిగ్గా విన్నారో లేదో అని మళ్ళీ క్లియర్ గా క్లైమాక్స్ చెబుతున్నాను. ఈ క్లైమాక్స్ తప్ప వేరే ఏది కూడా ఈ సినిమాకి వర్కౌట్ కాదు అన్నాను. దానితో పవన్ నువ్వు క్లైమాక్స్ మార్చి ఉంటే నేను నీకు సినిమా అవకాశం ఇచ్చేవాడిని కాదు. ఆ సినిమాకు అదే క్లైమాక్స్ సూపర్ ఉంటుంది దాన్ని ఏమాత్రం మార్చాల్సిన అవసరం లేదు అని పవన్ అన్నాడు. అలాగే నాకు సినిమా అవకాశం ఇచ్చాడు అని పూరి జగన్నాథ్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: