టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో సౌందర్య తర్వాత హీరోయిన్ సమంత అన్నట్లుగా వ్యవహారం నడుస్తుంది. అయితే అలాంటి సమంత కెరీర్ లో విడాకులు అంశం పెద్ద విలన్ గా మారింది. దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకుని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు కాపురం చేసుకుని... అక్కినేని నాగచైతన్య అలాగే సమంత విడిపోయారు. కానీ వీళ్ళ విడాకుల గురించి ఇప్పటికీ.. ఎవరికీ ఏమీ తెలియదు.


అసలు ఏ కారణాల వల్ల ఈ ఇద్దరు... విడాకులు తీసుకున్నారు అనే దాని పైన... ఎవరు క్లారిటీగా చెప్పలేకపోయారు. అయితే 2021 లో విడాకులు తీసుకున్న సమంత అలాగే అక్కినేని నాగచైతన్య.... అప్పటినుంచి ఇప్పటివరకు విడివిడిగానే ఉంటున్నారు. ఎవరి సినిమాలు వారివే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ అక్కినేని నాగచైతన్య మాత్రం... రెండో పెళ్లి ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.


టాలీవుడ్ హీరోయిన్ శోభితను అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అక్కినేని నాగ చైతన్య. అంటే ఇకపైన సమంతను అక్కినేని నాగచైతన్య కలవడన్నమాట. దీంతో సమంత కూడా రెచ్చిపోయి ఆక్టింగ్ చేస్తోంది. పొట్టి బట్టల్లో కనిపిస్తోంది. తాజాగా బాలీవుడ్లో సిటాడెల్ వెబ్ సిరీస్ లో... సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ ధావన్  తో కలిసి రొమాన్స్ చేయనుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ తాజాగా కూడా రిలీజ్ అయింది.


అంతకు ముందు టీజర్ కూడా వదిలారు. అయితే ట్రైలర్ అలాగే టీజర్ లలో చూసుకున్నట్లయితే... హీరో వరుణ్ ధావన్ అలాగే సమంత మధ్య రొమాంటిక్ సీన్స్ చాలా బ్రహ్మాండంగా కనిపించాయి. దీంతో ఈ సినిమాలో కచ్చితంగా వరుణ్ దావన్ కు లిప్ కిస్ పెడుతుందని... సమంతపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఈ వెబ్ సిరీస్ కోసం సమంత భారీగానే ఛార్జ్ తీసుకుంటుందట. అంటే ఈ లెక్కన కచ్చితంగా ఈ సినిమాలో... సమంత రెచ్చిపోవడం గ్యారంటీ అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: