నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'దసరా' సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సూపర్ హిట్ కాంబోలో మరో సినిమాను అనౌన్స్ చేశాడు నాని. చాలా కాలం క్రితమే అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్టు ను 'దసరా' పండుగా సందర్బంగా అధికారికంగా మొదలుపెట్టాడు హీరో నాని. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ప్రస్తుతం దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

ఇక ఇటీవల నాని, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ సరిపోదా శనివారం. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా నాని ఈ హ్యాట్రిక్ హిట్ అందించింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని సూర్య అనే పాత్రలో జీవించేశాడు. ఇక ఇందులో నానికి అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా.? అతడి అక్క పాత్రలో ఆమె చక్కని అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరో.? బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే.. ఆ నటి మరెవరో కాదు.. తమిళ హీరోయిన్ అదితి బాలన్. అరువి అనే చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది

 ఈ బ్యూటీ. మొదటి చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ఈ లో ఆమె నటనకు గానూ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత కుట్టీ స్టోరీతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వచ్చిన కోల్డ్ కేస్ చిత్రంలో నటించింది. అలాగే నివిన్ పౌలీ పదవెట్టు చిత్రంలోనూ మెరిసింది ఈ భామ. ఇక తెలుగులో సమంతా ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం చిత్రంలో.. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. లేటెస్ట్‌గా ఈ ఏడాదిలోనే రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్ మూవీలోనూ అమ్మడు మెరిసింది. ఈ చిన్నది చేసింది తక్కువ లే అయినప్పటికీ.. మూడు ఇండస్ట్రీలలోనూ సక్సెస్ రేట్ ఎక్కువేనని చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: