పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో హీరోయిన్లను రిపీట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఇక పవన్ తన కెరియర్లో ఒక ముద్దు గుమ్మతో మాత్రమే మూడు సార్లు కలిసి నటించాడు. పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబినేషన్లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. మొదటగా పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా గబ్బర్ సింగ్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ కంటే ముందు ఇటు పవన్ అటు శృతి హాసన్ ఇద్దరూ కూడా ప్లాపుల్లోనే ఉన్నారు. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయం సాధించడంతో ఈ జంటకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది.

ఆ తర్వాత పవన్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా కాటమ రాయుడు అనే మూవీ వచ్చింది. ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా వీరి జంటకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే వీరిద్దరి కాంబోలో మూడవ సినిమాగా వకీల్ సాబ్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. వీరి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేమిటో తెలుసా ? అసలు విషయం లోకి వెళితే ... పవన్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ హిందీ సినిమా అయినటువంటి దబాంగ్ కి అధికారిక రీమేక్ గా రూపొందింది.

కాటమ రాయుడు సినిమా తమిళ మూవీ అయినటువంటి వీరమ్ మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. వకీల్ సాబ్ మూవీ హిందీ సినిమా అయినటువంటి పింక్ కి రీమేక్ గా రూపొందింది. ఇలా వీరి కాంబోలో మూడు సినిమాలు కూడా రీమిక్ సినిమాలే. అలా వీరి కాంబోలో రూపొందిన ప్రతి సినిమా కూడా రీమిక్ సినిమా కావడమే ఓ కామన్ పాయింట్.

మరింత సమాచారం తెలుసుకోండి: