ఇక బిగ్ బాస్ గేమ్ విషయానికొస్తే, మొదట్లో కామ్ గోయింగ్ అనిపించిన నబీల్ మెల్ల మెల్లగా తనను తాను ముందుకి పుష్ చేసుకుంటూ చాలా బాగా ఆడడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో టాస్కుల్లో మంచి పనితనం కనబరచడంతో పాటుగా హౌస్ మేట్స్ మధ్య మంచి పాజిటివిటీ సంపాదించుకున్నాడు. అలాగే వీక్షకులు కూడా నబీల్‌నే ఈ సారి సీజన్ విన్నర్ అవుతాడని ఫిక్స్ అయిపోయారు కూడా. అంతేకాదండోయ్, లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన సీత కూడా ఇదే కోరుకోవడం విశేషం.
ఇక అందరినీ మించి హోస్ట్ నాగార్జున దృష్టిలో కూడా నబీల్ ఉండడం కొసమెరుపు. నాగార్జున కొన్ని కొన్ని సందర్భాలలో నబీల్ ని ఉద్దేశించి మంచి పాజిటివ్ గా మారడం తెలిసిందే. సో, ఎలా చూసుకున్నా.. ఈ సారి బిగ్‌బాస్ కప్పు గెలుచుకునేది నబీలే అని అందరూ అనుకుంటున్నారు. అయితే, బిగ్‌బాస్ ఆటలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. మంచిగా ఆడుతున్నారు అనుకున్నవాళ్లు చెడుగా ప్రమోట్ కావచ్చు. చెత్తగా ఆడుతున్నారు అనుకున్నవాళ్లు మంచి వాళ్లుగానూ మారిపోవచ్చు. ఏది ఏమైనా నబీల్ ప్రస్తుతం అయితే అందరి కళ్ళల్లో ఉన్నాడు అనేది వాస్తవం. మరి ఈ తీరు చివరి వరకూ ఇలాగే కొనసాగుతుందా? లేక మధ్యలోనే ఎలిమినేట్ అవుతాడా? అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ నబీల్ ఈసారి కప్పు కొట్టే తీరుతాడు అని ఓ వర్గం వారు మాత్రం బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఒకవేళ, మీరు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ చూస్తున్నట్టయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయండి!