ఇక్కడి ఫోటోని గమనించారా? అది మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమాలో స్టైల్ అని చాలా స్పష్టంగా తెలుస్తోంది కదా. అయితే ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి మన మాస్ మహారాజ్ సినిమాలు. కారణం ఏమిటో తెలియదు కానీ, రవితేజ గత కొన్ని సంవత్సరాలుగా సత్తువలేని కధలు చేసుకుంటూ పోతున్నాడు. హిట్టుతో సంబంధం లేకుండా కేవలం ధనార్జనే పెట్టుకున్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇలా అయితే కొన్నాళ్ళకు రవితేజ పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోతాడనే గుసగుసలు టాలీవుడ్లో బాగా వినబడుతున్నాయి. అవును, ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.

ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇకపోతే రవితేజ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసాడు. అలా రవితేజ నటించిన సినిమాల్లో "ఆంజనేయులు" సినిమా ఒకటి. ఈ సినిమాలో రవితేజ కామెడీ అదిరిపోతుంది. ఆంజనేయులు సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా, రవితేజకు జోడీగా నయనతార నటించింది. ఆంజనేయులు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో ఆ సినిమాకి సంబంధించినదే. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సోనూ సూద్, బ్రహ్మానందం, మాళవిక కీలక పాత్రల్లో నటించగా, తమన్ ఇచ్చిన సంగీతానికి మూవీలో అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

ఇక అసలు విషయంలోకి వెళితే, పై ఫొటోలో ఉన్న కెమెరామెన్ ను గుర్తుపట్టారా? అవును, మీరు అనుకుంటున్నది నిజమే. అతను టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు విజయ్ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అదే విధంగా డైరెక్షన్ డిపార్టుమెంటులో కూడా చేసిన అనుభవం మనోడికి ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నువ్విలా సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు విజయ్.. ఇక పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన ఈ కుర్ర హీరో విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'అర్జున్ రెడ్డి'తో ఏకంగా సూపర్ స్టార్ ఐన సంగతి విదితమే!

మరింత సమాచారం తెలుసుకోండి: