నందమూరి నట సింహం బాలకృష్ణ కు బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన కెరియర్లో ఇద్దరు దర్శకులు మాత్రం ఎంతో స్పెషల్. ఎందుకు అంటే బాలకృష్ణతో వారు చేసిన సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు వారు .? బాలకృష్ణ తో వారు ఏ సినిమాలు చేశారు .? అవి ఎలాంటి విజయాలను అందుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ కి అద్భుతమైన విజయాలను అందించిన దర్శకుల లిస్టులో మొదటగా ఉండేది బి గోపాల్ , బోయపాటి శ్రీను. బాలకృష్ణ , గోపాల్ కాంబినేషన్లో లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ , సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు , పలనాటి బ్రహ్మనాయుడు అనే ఐదు సినిమాలు రూపొందాయి. ఇందులో లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా , సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు మూవీలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. పలనాటి బ్రహ్మనాయుడు సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. వీరి కాంబోలో ఆరవ మూవీగా హర హర మహదేవ అనే సినిమాను కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చాక ఈ మూవీ క్యాన్సిల్ అయింది. ఇకపోతే బాలయ్య , బోయపాటి కాంబోలో సింహ , లెజెండ్ , అఖండ అనే మూడు మూవీలు వచ్చాయి. ఈ మూడు మూవీలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇకపోతే వీరి కాంబోలో నాలుగవ సినిమాగా అఖండ 2 రాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇలా బాలయ్యకు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను అందించిన దర్శకులలో గోపాల్ , బోయపాటి ముందు వరుసలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: