ఓటీటీలు వచ్చాక డిఫరెంట్ కంటెంట్ సినిమాలు పెరిగాయి. విభిన్న కథాంశాలతో సినిమాలు, వెబ్ సిరీసులను తెరకెక్కిస్తున్నారు.వాటిలో హారర్, కామెడీ, బోల్డ్, క్రైమ్ సస్పెన్స్ వంటి జోనర్స్‌తోపాటు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ కూడా ప్లేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.ఇక వాటిలో కొన్ని నేరుగా ఓటీటీ రిలీజ్ అవుతుంటే.. మరికొన్ని థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఆ సినిమాల టాక్, కలెక్షన్స్ పరంగా ఓటీటీ రిలీజ్ డేట్ ఉంటోంది. అయితే, హర్రర్ సినిమాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇదొక అడిక్షన్, బ్యాడ్ హ్యాబిట్ లాగా ఉంటుంది చాలామందికి. ఎందుకంటే ఈ హర్రర్ సినిమాలను చూస్తున్నప్పుడు ఓవైపు వణికిపోతున్నా సరే సినిమాలను చూడడం మాత్రం మానరు. అవసరమైతే దుప్పటి కప్పుకుని, లేదంటే కళ్ళు మూసుకుని అయినా సరే హర్రర్ సినిమాలను చూసేటంత పిచ్చి ఉంటుంది చాలా మందికి.ఇలా క్రేజీగా హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళ కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఓటిటిని ఊపేస్తున్న ఈ హర్రర్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? సినిమా స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం.ఇక సినిమా కథ విషయానికొస్తే సినిమాలో హీరోయిన్ సింగిల్ పేరెంట్. భర్త చనిపోవడంతో కొడుకుతో కలిసి సింగిల్ గా జీవిస్తుంది. ఉద్యోగం చేస్తూ పిల్లాడిని ఒక్కతే పోషిస్తుంది. ఇక ఆ పిల్లోడు కూడా స్కూల్ కి వెళ్తూ తల్లితో సంతోషంగా ఉంటాడు. ఈ క్రమంలోనే వాళ్ళ ఇంట్లో ఓ బుక్ కనిపిస్తుంది. దీంతో తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి ఆ బుక్ ను తీసి చదువుతారు. కానీ అదే ఆ తల్లి కొడుకులు ఇద్దరికీ అతిపెద్ద శాపంగా మారుతుంది.

ఆ పుస్తకంలో ఒక రాక్షసుడు వస్తే అనర్ధాలు జరుగుతాయని రాసి ఉండడం కనిపిస్తుంది. అయితే అంతకంటే ముందే ఆ పుస్తకాన్ని చూడగానే భయం వేసేలా ఉంటుంది. మొత్తానికి ఈ పుస్తకాన్ని చదివి తల్లి కొడుకులు ఇద్దరు తప్పు చేస్తారు. బుక్ ఓపెన్ చేసింది మొదలు వింత వింత సంఘటనలు జరుగుతూ తల్లి కొడుకులు ఇద్దరినీ భయపడతాయి. కొడుకు అయితే ఏకంగా పుస్తకంలో ఉన్న రాక్షసుడు కనిపించాడు అంటూ భయపడతాడు. అలాగే తల్లికి కూడా జరుగుతుంది. చివరికి తల్లి కొడుకులు ఇద్దరికీ ఆ రాక్షసుడు కనిపిస్తాడు. మరి అసలు ఈ రాక్షసుడు తల్లి కొడుకులు ఇద్దరికీ ఎందుకు కనిపిస్తున్నాడు? అసలు ఆ బుక్ లో ఉన్న ఈ రాక్షసుడు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమాను చూడండి.ఈ నేపథ్యంలో హర్రర్ సినిమాలు అంటే ఓ లెక్క ఉంటుంది. వణుకు పుట్టించేలా ఉండే కిక్ కోసమే ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా అద్భుతమైన హర్రర్ ఎలిమెంట్స్ తో ఫుల్ థ్రిల్ ఇచ్చే విధంగా ఉంటుంది. అంతేకాకుండా గూస్ బంప్స్ తెప్పించే ఈ స్టోరీని డైరెక్టర్ రూపొందించిన తీరుకు మెచ్చుకోకుండా ఉండలేరు. సినిమా మొత్తం తల్లి కొడుకుల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ది బ్యాడ్ బుక్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: