తెలుగు సినీ పరిశ్రమ లో నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుదీర్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన ఇప్పటివరకు చాలా సినిమాల లో హీరో గా నటించాడు . కానీ అతి తక్కువ సినిమాలతో మాత్రమే విజయాలను అందుకున్నాడు . ఇకపోతే సుదీర్ బాబు ఇప్పటివరకు తన కెరియర్ లో 18 సినిమాలలో హీరోగా నటించాడు . అందులో ప్రేమ కథ చిత్రం సినిమా మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక సమ్మోహనం సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

ఈ రెండు సినిమాలను మినహాయిస్తే సుదీర్ బాబు కు ఏ సినిమా ద్వారా కూడా మంచి విజయం దక్కలేదు. ఈయనకి విజయాలు లేకపోయిన ఎప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలలో నటించకుండా వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ రావడంతో నటుడిగా మాత్రం ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ బాబు "మా నాన్న సూపర్ హీరో" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అలా మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల ఈ సినిమాకు మొదట పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ ఈ సినిమాకు భారీ మొత్తంలో కలక్షన్లు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమా ద్వారా కూడా సుధీర్ బాబు కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశే ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా ఈయనకు అపజయాలు వస్తున్నా కూడా రొటీన్ సినిమాలో చేయకుండా డిఫరెంట్ సినిమాల్లో నటిస్తూ రావడంతో ఈయనను నటుడిగ చాలా మంది మెచ్చుకుంటూ ప్రశంశలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: