ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా చెప్పుకునే వారు ఏడాదికి ఒక సినిమాతో ముందుకు రావడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాగే రాజమౌళి , శంకర్ లాంటి దర్శకులు అయితే రెండు , మూడు సంవత్సరాలకు ఒక సినిమా తీస్తూ వస్తున్నారు. కానీ మన పాత తరం హీరోలు మాత్రం సంవత్సరానికి 15 -18 పైగా సినిమాలు విడుదల చేసీన‌ రీకార్డులు కూడా ఉన్నాయి. అలా ఏడాదికి ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన స్టార్ హీరోలు ఎవరో ఇక్కడ చూద్దాం. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్లో 1970లో ఒక్కేసారి 16 సినిమాల్లో నటించారు.. అలాగే మరుసటి సంవత్సరం ఒకేసారి 11 సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అలాగే 1972లో కూడా కృష్ణ ఏకంగా హీరోగా 18 సినిమాలు విడుదలయ్యాయి. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ హీరో టచ్ చేయలేకపోయారు.  ఎవరు ఈ రికార్డును బ్రేక్ చేయలేర‌ని కూడా చెప్పవచ్చు.  


అలాగే నటరత్న ఎన్టీఆర్ కూడా 1964 హీరోగా 17 సినిమాల్లో నటించారు.. వాటిలో తొలి సినిమా కర్ణా కాగా చివర సినిమాగా భ‌క్త‌ రామదాసును ప్రేక్షకుల‌ ముందుకు తీసుకువచ్చారు.  అలాగే మరో సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా 1974లో 17 కు పైగా సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అన్ని సినిమాలు అప్పట్లో మంచి విజయం సాధించాయని కూడా అంటారు.  అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా 1980లో ఏకంగా 14 సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. వాటిలో తొలి సినిమా అగ్ని సంస్కారం కాగా చివరి సినిమా రతబంధం. మరో సీనియర్ హీరో జగపతిబాబు కూడా అప్పట్లో హీరోగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ దూసుకుపోతున్న సమయంలో ఒకే సంవత్సరంలో 6 సినిమాలు తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలో నటిస్తూ బీజీగా ఉన్న‌డు.


 అలాగే నట‌సింహం నందమూరి బాలకృష్ణ కూడా 1987వ సంవత్సరంలో ఏకాంగా ఏడు సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలు అందుకున్నాడు. ఇలా మన సీనియర్ హీరోలు సంవత్సరానికి 5 సినిమాలకు పైగా నటించేవారు. థియేటర్లో కూడా ప్రతి నెల ఏదో ఒక కొత్త సినిమా వస్తూ ఉండేది. కానీ ప్రస్తుతరం హీరోలు మాత్రం ఒక్క‌ సినిమా చేయడానికి సంవత్సరాలు సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు. ఈ కారణంగా చిత్ర పరిశ్రమల్లో సినిమాల సంఖ్య తగ్గపోతు వస్తుంది. మరి ఇప్పటికైనా నేటి తరం హీరోలు వరస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం.
[3:29 pm, 16/10/2024] Leela:

మరింత సమాచారం తెలుసుకోండి: