కొంచెం బొద్దుగా ఉన్న.. చూడడానికి చక్కగా ఉన్న.. అలాంటి హీరోయిన్ లని ప్రతి ఒక్కరు కూడా దివంగత నటి సౌందర్యతో కంపేర్ చేస్తూ ఉంటారు . సౌందర్య ఎంత మల్టీ టాలెంట్ పర్సన్ అనే విష్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . చాలా చాలా మంచి వ్యక్తి . కష్టంలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉంటుంది . తన వద్దకు సహాయం కోసం రాకపోయినా సరే ఎవరైనా కష్టంలో ఉన్నారు అని తెలుసుకుంటే కచ్చితంగా వాళ్ళ కష్టాన్ని తీర్చే విధంగా ఆమె హెల్ప్ చేస్తుంది . అలాంటి ఒక మహా అద్భుతమైన మంచి మనసు కలిగిన హీరోయిన్ సౌందర్య .


సౌందర్య హీరోయిన్గా ఎన్ని సూపర్ డూపర్ హిట్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఒక మంచి నటిని కోల్పోయింది అని మాత్రం మనం చెప్పుకోవాలి. కాగ ఇండస్ట్రీలో సౌందర్య లాగా ట్యాగ్ చేయించుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు . వాళ్ళల్లో ఒకరే హనీ రోజ్. బాలయ్య "వీరసింహారెడ్డి" సినిమాలో ఆయనకు మరదలు పాత్రలో నటించి మెప్పించింది . చూడడానికి కొంచెం బొద్దుగా.. చూడగానే అట్రాక్ట్ చేసే విధంగా ఉండే హనీ రోజ్.. ఈ సినిమా హిట్ తో కచ్చితంగా ఇండస్ట్రీలో సౌందర్యను రీప్లేస్  చేసే పొజిషన్ ని అందుకుంటుంది అంటూ అంతా అనుకున్నారు.



వామ్మో..బడాబడా ఆఫర్స్ కూడా ఆమె ఖాతాలో పడిపోతున్నాయి అంటూ మాట్లాడుకున్నారు. సీన్ కట్ చేస్తే వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఆమె పెద్దగా చెప్పుకోతగ్గ సినిమాలలో నటించలేదు . షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి తప్పిస్తే మరి ఏ పనికి కూడా పెద్దగా  హనీ రోజ్ పేరు పనికి రాలేదు. ఇప్పటికి హనీ రోజ్ అటు ఇటు కాకుండా మధ్యలోనే మిగిలిపోయింది. కానీ ఆమె పేరుకు అసలు సరైన స్థానం లేకుండా పోయింది సినిమా ఇండస్ట్రీలో అంటున్నారు . అందుకే ప్రతి ఒక్కరిని సౌందర్యతో కంపేర్ చేయకూడదు .. సౌందర్య లాంటి హీరోయిన్ ఇండస్ట్రీలో ఒకరే ఉంటారు . ఆ ఒక్కరే సౌందర్య .  ఆమె ప్లేస్ ను రీప్లేస్ చేసేవాళ్లే లేరు అంటూ సౌందర్య ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: