టైం బాగోలేకపోతే అరటిపండు నోట్లో పెట్టుకున్న పన్ను విరిగిపోతుంది అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు . బహుశా ఈ హీరోయిన్స్ విషయంలో అదే నజమైంది.  లేకపోతే అందంగా ఉంటారు అంతకుమించిన నటన టాలెంట్ కూడా ఉంటుంది.  హిట్స్ కూడా అందుకున్నారు . కానీ సడన్గా బొక్క బోర్లా పడుతూ బోలెడన్ని ప్లాప్ లు తమ ఖాతాలో వేసుకున్నారు . ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా..


స్టార్ హీరోయిన్స్ గా ఉండే వాళ్ళు ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తున్న పరిస్థితిలో ఉన్నారు అంటే దానికి ముమ్మాటికి తప్పు వాళ్లదానే చెప్పాలి.  స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చాక ఎలాంటివి పడితే అలాంటి సినిమాలు చేయకూడదు . మరీ ముఖ్యంగా ఆ హీరో ఫ్యాన్స్ సినిమాని హిట్ చేస్తారులే .. మనకు ఏముంది అన్న ధీమాలో సినిమాని కమిట్ అవ్వకూడదు .. అలా కమిట్ అయ్యి కృతి శెట్టి , శ్రీ లీల , కీర్తి సురేష్ , పూజా హెగ్డే చాలా విషయాలలో బొక్క బోర్ల పడ్డారు .



మరీ ముఖ్యంగా ఈ నలుగురు హీరోయిన్స్ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. శ్రీ లీల - కృతి శెట్టి - కీర్తి సురేష్ కెరియర్ స్టార్టింగ్ లోనే బడా బడా హిట్స్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత ఫుల్ ఫ్లాప్స్ తమ ఖాతాలో వేసుకున్నారు . ఆ తర్వాత మళ్లీ స్టార్స్ గా మారడానికి తాపత్రయపడుతున్నారు . దానికి కారణం వీళ్ళు తీసుకున్న రాంగ్ డెసిషన్. సినిమా హిట్ అయ్యాక వచ్చిన క్రేజ్ మోజులో ఎలాంటివి పడితే అలాంటి సినిమాలు చేయడం ప్రారంభించారు . రిజల్ట్ చూసి షాక్ అయిపోయారు.  ఇప్పుడు స్టార్స్ గా మారడానికి తాపత్రయపడుతున్నారు .  కీర్తి సురేష్ అయిన కొంచెం నిలదొక్కుకోగల్గింది. కృతి-శ్రీలీల చాలా చాలా టఫ్ పొజిషన్లో ఉన్నారు. అయితే పూజా హెగ్డే పరిస్థితి వేరే . పూజా హెగ్డే కెరియర్ స్టార్టింగ్ లోనే ఫ్లాప్స్  అందుకుంది.  ఆ తర్వాత హిట్స్ అందుకుంది . మళ్లీ ఫ్లాప్స్ అందుకొని ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: