నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్.బి.కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా , సితార ఎంటర్టైన్మెంట్ ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కానీ ఏ తేదీన విడుదల చేయనున్నారు అనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లో ఈ మూవీ మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బాలయ్య కొన్ని సంవత్సరాల క్రితం నటించిన చాలా బ్లాక్ బస్టర్ సినిమాలలో ముగ్గురు హీరోయిన్లు ఉన్న సందర్భాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం బాలయ్య నటించిన సినిమాలలో ముగ్గురు హీరోయిన్లు ఎక్కువగా కనిపించడం లేదు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఎన్బికే 109 మూవీ లో బాలయ్య సరసన ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధా శ్రీనాథ్ ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి గతంలో బాలయ్య హీరోగా రూపొందిన సినిమాలలో ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి. మరి ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: