డిఫరెంట్ సినిమాలు ఎంచుకుంటూ మంచి హీరోగా ఎదగాలని ప్రయత్నిస్తున్న సుహాస్ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. రెగ్యులర్ ఫార్మెట్ సినిమాలకు భిన్నంగా సినిమాలలో నటించాలి అని సుహాస్ చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం సక్సస్ ను ఇవ్వలేకపోతున్నాయి. లేటెస్ట్ గా ‘దసరా’ రేసులో విడుదలైన ‘జనక అయితే గనక’ మూవీకి మంచి రివ్యూలు వచ్చినప్పటికీ ఆమూవీకి పండుగ సీజన్ లో కూడ కనీసపు కలక్షన్స్ రాకపోవడం ఆశ్చర్యంగా మారింది.



వాస్తవానికి ‘దసరా’ రేసులో విడుదలైన ‘విశ్వం’ ‘మానాన్న సూపర్ హీరో సినిమాలకు మంచి టాక్ రాకపోయినప్పటికీ సుహాస్ సినిమా ఈవిషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోలేకపోయింది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల గతంలో సలార్ లాంటి బ్లాక్ బస్టర్లకు ప్రశాంత్ నీల్ తో పని చేసిన అనుభవము ఉన్నప్పటికీ తన మొదటి సినిమా విషయంలో ఫెయిల్ అయ్యాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి.



దీనితో సుహాస్ పొరపాటు ఎక్కడ జరుగుతోందో గుర్తించాలని లేదంటే అతడి కెరియర్ సమస్యలలో పడే ఆస్కారం ఉంది అంటూ కొందరు సన్నిహితులు అతడికి సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. సుహాస్ ఈమధ్య కాలంలో నటించిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ సినిమాలో  గుండు కొట్టించుకుని నటించాడు. సినిమా టైటిల్ ఒక జంతువు మీద పెట్టి వెరైటీగా తీసిన ‘గొర్రె పురాణం’ ఘోరంగా ఫ్లాప్ అయింది.



‘జనక అయితే గనక’ కు దిల్ రాజు లాంటి బడా నిర్మాత అండగా నిలబడినప్పటికీ ఈమూవీ కనీసపు కలక్షన్స్ ను కూడ తెచ్చుకోలేకపోయింది. రానున్న రోజులలో ఈహీరో ‘కేబుల్ రెడ్డి’ ‘ఆనందరావు అడ్వెంచర్స్’ ‘ఉప్పు కప్పురంబు’ లాంటి సినిమాలలో నటిస్తున్నాడు. అయితే ప్రేక్షకులు మాత్రం ‘రైటర్ పద్మభూషణ్’ ‘కలర్ ఫోటో’ లాంటి సినిమాలను మాత్రమే ఆశిస్తున్నారు. దీనితో ఈ యంగ్ హీరో సరైన నిర్ణయం తీసుకోకపోతే రానున్న రోజులలో ఇతడి కెరియర్ మరింత ప్రమాదంలో పడే ఆస్కారం ఉండి అంటూ హెచ్చరికలు వస్తున్నాయి..      



మరింత సమాచారం తెలుసుకోండి: