తమిళనాడు రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని చెన్నై పట్టణంలో మాత్రం బయటికి జనాలు రాకుండా వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా.. వరదలే కనిపిస్తున్నాయి.  చెన్నై పట్టణంలోని కాలనీలన్నీ జలమయమయ్యాయి. అయితే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని ముందే ఊహించిన జనాలు... అలర్ట్ కూడా అవ్వడం జరిగింది.

ఇందులో భాగంగానే తమకు సంబంధించిన బైక్లను ఫస్ట్ ఫ్లోర్ లేదా టెర్రస్ పైన పార్కింగ్ చేసుకున్నారు. ఇంట్లోకి నీళ్లు వచ్చిన సరే బైకులు.. కొట్టుకుపోకుండా ప్లాన్ చేసుకున్నారు. అటు కార్లు ఉన్నవారు... చెన్నై పట్టణంలోని ఫ్లై ఓవర్ లపై పార్కింగ్ చేశారు. ఫైన్ పడ్డ సరే పార్కింగ్ మాత్రం అక్కడే చేస్తామని డిసైడ్... ఫ్లై ఓవర్ల పైన పార్కింగ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఇప్పటికే చెన్నై పట్టణానికి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు అధికారులు. ఎమ్మార్వో రెండు రోజులపాటు చెన్నైలో వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో చెన్నైలో ఉంటున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఊహించని షాక్ తగిలింది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఇల్లు పూర్తిగా వరదలో మునగడం జరిగింది. పోయేస్ గార్డెన్ నివాసం మొత్తం వరదతో నిండిపోయింది. అయితే ఈ వరద వచ్చినప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్... తన ఇంట్లో లేరని సమాచారం.

 సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఫామ్ హౌస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ఇల్లు మునగడం ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా వరదకు రజనీకాంత్ ఇల్లు మునిగిపోయింది. అప్పుడు కూడా సోషల్ మీడియాలో రజనీకాంత్ కు సంబంధించిన వార్త వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా..  ఇటీవల వెట్టియాన్ అనే సినిమాతో  ప్రేక్షకుల ముందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి సక్సెస్ అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: