ఇప్పుడు చాలా మంది సినిమా హీరోలు, హీరోయిన్లు పెద్ద సినిమా కుటుంబాల నుంచే వస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే జరుగుతోంది. పెద్ద హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల పిల్లలు కూడా సినిమాల్లోకి రావడం మనం చూస్తున్నాం. కొందరు మొదటి సినిమాతోనే సూపర్ స్టార్స్ అయిపోతుంటే, మరికొందరు ఇండస్ట్రీలో సర్వైవ్ కావడానికి చాలానే కష్టపడుతున్నారు. ఇప్పుడు మరో సీనియర్ దర్శకుడి కొడుకు కూడా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు తెలుగులో యూత్‌కి నచ్చే సినిమాలు ఎక్కువగా తీసిన దర్శకుడు తేజ. ఈయన కొడుకు కూడా ఇప్పుడు సినిమా హీరోగా అడుగుపెడుతున్నాడు.
ప్రముఖ దర్శకుడు తేజ తన కొడుకు అమితోవ్ తేజను సినిమా హీరోగా పరిచయం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తేజ గతంలో చాలా హిట్ సినిమాలు తీశారు. ముఖ్యంగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ఆయనకు మంచి విజయం వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన దగ్గుబాటి వంశీ కొడుకు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'అహింస' అనే సినిమా తీశారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
ప్రముఖ దర్శకుడు తేజ ఇప్పుడు తన కొడుకు అమితోవ్ తేజపై దృష్టి సారించారు. తన కొడుకు హీరోగా మారే ముందు అన్ని రకాల శిక్షణ తీసుకోవాలని తేజ కోరుకుంటున్నారు. అంటే, అమితోవ్ నటనలో పూర్తిగా సిద్ధపడిన తర్వాతే సినిమాల్లోకి అడుగుపెట్టాలని తేజ భావిస్తున్నారు.
కానీ ఇంకా కొన్ని విషయాలు స్పష్టంగా తెలియదు. అమితోవ్ నటించే సినిమాను ఎవరు నిర్మించబోతున్నారు? తేజే ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారా లేక మరో సీనియర్ దర్శకుడికి అప్పగిస్తారా అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. దర్శకుడు తేజ ఈ సినిమా తీసి హిట్టు కొడితే ఆ సినిమాతోనే కొడుకుని నిలబడతాడు అలాగే తాను కూడా కం బ్యాక్ ఇస్తాడు.