టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు....అందరికంటే విభిన్నంగా సినిమాలు తెరకెక్కించే రామ్ గోపాల్ వర్మ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు.. టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ‘శివ’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించాడు.. అప్పట్లో శివ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. శివ సినిమాతో ఆర్జివి టాలీవుడ్ కి విభిన్న జోనర్ ని పరిచయం చేసాడు..ఆ తరువాత క్షణ క్షణం, గాయం, సత్య వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన ఆర్జివి విలక్షణమైన సినిమాలతో నూతన ట్రెండ్ సృష్టించాడు.. అయితే అంతటి వేవ్ సృష్టించిన ఆర్జివికి ఏమైంది..తన మైండ్ సెట్ ఎందుకు మార్చుకున్నారు.. మాఫియా కథలకు, ఫ్యాక్షన్ కథలకు ఊపు తీసుకొచ్చిన ఆర్జివి సడన్ గా ఎందుకు డౌన్ ఫాల్ అయ్యారో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న..గత కొంతకాలంగా బూతు సినిమాలకే ఆయన పరిమితమయ్యాడు.ప్రస్తుతం ఆర్జివి
బోల్డ్ కథలతో మూవీస్ తెరకెక్కించి ఓటిటిలో కానీ థియేటర్స్ లో కానీ రిలీజ్ చేస్తు కాలం గడుపుతున్నాడు..

ఇదిలా ఉంటే ఆర్జివి  సమర్పణలో స్తున్న లేటెస్ట్ బోల్డ్ మూవీ ‘శారీ’. తాజాగా ఈ సినిమాలోని ఐ వాంట్ లవ్ అనే ఓ పాట మూడు వెర్షన్లకు సంబంధించిన టీజర్లను ఆర్జివి ఎక్స్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు. సినిమా చరిత్రలోనే ఇలా జరగడం ఇదే తొలిసారి అంటూ ఒకే పాటకు మూడు వెర్షన్ల టీజర్లను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశాడు. ఆరాధ్య దేవి నటిస్తున్న ఈ మూవీలోని సాంగ్ టీజర్ హీటు పుట్టిస్తుంది. తడి అందాలను చూపిస్తూ ఆరాధ్య దేవి అదరగొట్టింది.. అయితే ఈ మూడు వెర్షన్లు పూర్తి సాంగ్స్ గురువారం (అక్టోబర్ 17) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఆర్జివి వెల్లడించాడు.ఈ మూవీని గిరీష్ కృష్ణ కమల్ డైరెక్ట్ చేస్తుండగా రవి వర్మ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV