తమిళ హాస్యనటుడుగా పేరుపొందిన నటుడు కరుణాకరన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. తమిళ డబ్బింగ్ చిత్రాలు తెలుగులో విడుదలై తన కామెడీతో ప్రేక్షకులను బాగా అలరించారు. మొదట చిన్న చిన్న చిత్రాలలో నటుడుగా మొదలుపెట్టి స్టార్ హీరోల చిత్రాలలో కూడా కమెడియన్ గా నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే వందకు పైగా తమిళ చిత్రాలలో నటించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ నటుడు ఇంట చోరీ జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తిగా చూద్దాం.


కమెడియన్ కరుణాకర్ ఇంట్లో 60 తులాల బంగారు చోరి గురైనట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ దొంగతనం ఆ ఇంట పనిమనిషి చేసినట్లు పోలీసులు గుర్తించి ఆమెను అరెస్టు చేశారట. కరుణాకరన్ చెన్నైలోని OMR రోడ్డు పక్కన ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. ఆయన ఇంట్లో 60 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో షాక్ గురైన కరుణాకరన్ భార్య.. దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి ఫిర్యాదు చేసిందట.అయితే దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కరుణాకరన్ ఇంటిని తనిఖీ చేయగా నగలు ఉన్న  బీరువా పగలకుండా కనిపించడంతో బయట వ్యక్తులు ఈ చోరీకి పాల్పడలేదని లోపల వ్యక్తుల ఎవరో పాల్పడ్డారని నిర్ధారించారట.


అనంతరం ఇంట్లోని వ్యక్తులు పనిచేసే వారి వేలిముద్రలను సైతం పోలీసులు సేకరించగా ఈ ఘటనలో కరుణాకర్ణి ఇంట్లో పనిచేసే విజయ అనే మహిళ ఈ దొంగతనం చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని మరి విచారిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అటు తమిళ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలాన్నే సృష్టిస్తోంది. అయితే తమిళ్ నటుల ఇంట్లో ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో కూడా పని మనుషులే దొంగతనం చేశారు. అలాగే హీరోయిన్ అతుల్య రవి ఇంట్లో కూడా ఇలాంటి దొంగతనమే జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: