* హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మల్టీ స్టారర్స్

* అందున చిరు-శ్రీకాంత్ మల్టీస్టారర్‌కి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్

* వీరి క్రేజీ కాంబో మూవీ సూపర్ హిట్  

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, శ్రీకాంత్ కలిసి నటించిన ఒక మల్టీస్టారర్ మూవీ ఉంది. అదే 2004లో వచ్చిన "శంకర్ దాదా MBBS". ఈ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం వల్ల సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రేక్షకులను బాగా ఆలోచించింది. సినిమాలో ఒక మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది.

కథ ఏంటంటే...ఈ సినిమా హిందీలో వచ్చిన "మున్నాభాయ్ MBBS" అనే సూపర్ హిట్ సినిమాకి రీమేక్. కథలో చిరంజీవి శంకర్ ప్రసాద్ అనే లోకల్ డాన్ పాత్ర చేశారు. ఆయనకు చాలా మంచి స్నేహితుడైన ATM అనే పాత్రలో శ్రీకాంత్ నటించారు. కథలో ట్విస్ట్ ఏంటంటే, ఈ డాన్ కి డాక్టర్ కావాలనే కోరిక ఉంటుంది. తల్లిదండ్రులు కూడా అతని డాక్టర్ గా చూడాలనుకుంటారు. పేరెంట్స్ అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన డాక్టర్ లాగానే నటిస్తుంటాడు. తనని తాను నిజంగా డాక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు, ఎలాంటి ఫన్నీ సిచువేషన్స్ లో పడ్డాడు అనేది కథ.

చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శ్రీకాంత్ ఆయనకి తోడుగా నటించి, కామెడీకి మరింత కామెడీ పంచారు. చిరంజీవి పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కి శ్రీకాంత్ సపోర్టివ్ రోల్ చాలా బాగా సరిపోయింది. ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అంతా ఇంతా కాదు! వీళ్ళిద్దరు కలిసి నటించిన సన్నివేశాలు సినిమా మొత్తానికే హైలైట్. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందని అనుకున్నారు కానీ చిరంజీవి కొంతకాలానికే పాలిటిక్స్‌లోకి వచ్చారు. చాలా రోజులు పాలిటిక్స్ లోనే ఉన్నారు. సినిమాలని నిర్లక్ష్యం చేశారు. మళ్లీ సినిమాల్లోకి వచ్చేసరికి శ్రీకాంత్ దాదాపు ఫేడవుట్ అయ్యారు. ఇప్పుడు చిరంజీవి ఓన్లీ సోలోగా హిట్ సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. మల్టీస్టారర్‌ సినిమాల వైపు మొగ్గు చూపడం లేదు. కానీ వీరిద్దరి అభిమానులు మళ్లీ వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: