టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ తాజాగా విశ్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో కావ్య దాపర్ హీరోయిన్గా నటించగా ... శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను టీ జీ విశ్వప్రసాద్ నిర్మించాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 11 వ తేదీన విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఐదు రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.66 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 2.71 కోట్ల వసూళ్లు దక్కాయి. మొత్తంగా ఐదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 4.37 కోట్ల షేర్ ... 7.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఐదు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపు కొని 55 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఐదు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 4.92 కోట్ల షేర్ ... 9.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు దాదాపుగా 10 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఐదు రోజులు ముగిసే సరికి ఈ సినిమాకు 4.92 కోట్ల షేర్ కలక్షన్లు దక్కగా మరో ఐదు కోట్ల వరకు ఈ మూవీ షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్టుగా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: