తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించాడు. అలాగే కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ కూడా చేశాడు. రామ్ పోతినేని రిజెక్ట్ చేసిన ఓ మూవీలలో ఓ సినిమాలో రవితేజ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అసలు ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా మెహరీన్ హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇకపోతే ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... రాజా ది గ్రేట్ సినిమా కథను రవితేజ కంటే ముందు మరో హీరోకి వినిపించాను. ఆ హీరో ఎవరో కాదు రామ్ పోతినేని. ఆయనకు కథ వినిపించినప్పుడు సినిమా కథ వేరేలా ఉండేది. అది రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగేది. రాజా ది గ్రేట్ సినిమాలో హీరో , హీరోయిన్ సేవ్ చేస్తూ ఉంటాడు. కానీ రామ్ కి కథను వినిపించిన సమయంలో అందులో మాత్రం హీరో , హీరోయిన్ పాత్రలు ప్రేమించుకుంటాయి. సినిమా కథ మొత్తం విన్నాక రామ్ కి ఆ సమయంలో అది ఎందుకో కరెక్ట్ అనిపించలేదు.

అందుకే ఆ సమయంలో ఆ కథను ఆయన రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత నేను రవితేజ కు కొన్ని మార్పులు చేసి కథను వినిపించాను. ఆయనకు ఆ కథ బాగా నచ్చింది. దానితో ఆ సినిమాను రవితేజ తో రూపొందించాను అని అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే కొంత మంది రామ్ "రాజా ది గ్రేట్" సినిమా కథను ఓకే చేయాల్సింది. ఆ సినిమా కనుక రామ్ చేసి ఉంటే ఆయన కెరియర్ ఇప్పటికంటే మెరుగైన స్థితిలో ఉండేది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: