సోషల్ మీడియాలో ఒకప్పుడు హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ తో దూసుకుపోయిన సమంత ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ దక్కించుకుంటుంది అంటే కారణం మాత్రం ఆమె లైఫ్ లో తీసుకున్న డెసిషన్స్ అనే చెప్పాలి . నాగచైతన్య తో డివర్స్ తీసుకొని ఆమె పెద్ద తప్పు చేసింది అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు . ఇప్పటికీ సోషల్ మీడియాలో సమంతపేరు పై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది . కాగా సమంత అలాంటివి పట్టించుకోకుండా తన లైఫ్ తనది అంటూ ముందుకు దూసుకెళ్తుంది.
సిటాడాల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సమంతకి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . సమంత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రావడం సమంత తల్లికి అలాగే తండ్రికి ఇష్టం లేదు. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా చెప్పింది. అయితే సమంత నటించిన ఫేవరెట్ సినిమాలలో ఏది వాళ్ళ అమ్మకి ఇష్టమైన మూవీ అంటే మాత్రం "ఏం మాయ చేసావే" అంటూ చెప్పుకువచ్చింది. నిజానికి సమంత కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా "ఏం మాయ చేసావే". చాలా ముద్దుగా క్యూట్గా సైలెంట్ గా సమంత తన కెరీర్ ను సెట్ చేసుకునే విధంగా స్టామినా దక్కించుకుంది . సమంత తల్లికి కూడా ఈ సినిమా అంటే చాలా చాలా ఇష్టమట . సమంత పర్ఫామెన్స్ చాలా న్యాచురల్ గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది..!!