* f2 సినిమాతో రచ్చ చేసిన వెంకీ, వరుణ్‌
* అనిల్‌ రావిపూడి దర్శకత్వం f2, f3 సినిమాలు
* f3 కంటే  F2 సినిమానే బంపర్‌ హిట్‌
* తమన్నా, మెహరీన్‌ కామెడీ అదుర్స్‌


టాలీవుడ్ ఇండస్ట్రీలో... ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. బడా హీరోలు కూడా.. మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా బాలీవుడ్ అలాగే తమిళ ఇండస్ట్రీలో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మన తెలుగులో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అలా విక్టరీ వెంకటేష్... మెగా హీరో వరుణ్ తేజ్..  ఇద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయని చెప్పవచ్చు.


విక్టరీ వెంకటేష్ అలాగే వరుణ్ తేజ్ కాంబినేషన్లో... ఎఫ్2  సినిమా వచ్చింది. ఎఫ్2 అంటే ఫన్ అండ్ ఫ్రస్టేషన్. ఈ సినిమాను... సంచలన దర్శకుడు. అనిల్ రావిపూడి తీసిన సంగతి తెలిసిందే. అనిల్ ఎక్కువగా కామెడీ యాంగిల్ లో ఉండే సినిమాలు చేస్తారు. ఈ ఎఫ్2 కూడా...  మంచి కామెడీ సినిమానే. అయితే ఈ సినిమా కోసం దాదాపు 30 కోట్లు ఖర్చుపెట్టారు.


సినిమా వచ్చిన సమయంలో అంటే 2019 ఆ సమయంలో... 30 కోట్లు పెద్ద విషయమే. అయితే సినిమా సంక్రాంతి కానుకగా 2019లో రిలీజ్ అయింది.  మొదటి రోజు నుంచి ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టగలిగింది. ఈ తరుణంలోనే దాదాపు 150 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. అంటే నిర్మాతకు మంచి లాభాలే తీసుకువచ్చింది ఈ సినిమా.


ముఖ్యంగా ఈ సినిమాలో వెంకటేష్ అలాగే వరుణ్ తేజ్ కామెడీ అదిరిపోయింది. దానికి తోడు తమన్నా భాటియా, ఇటు మెహరీన్ కూడా అద్భుతంగా రాణించి మెప్పించారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. అయితే... ఈ సినిమా సక్సెస్ కావడంతో f3 కూడా తీశాడు.కానీ పెద్దగా ఈ సినిమా ఆడలేదు.కానీ కలెక్షన్లను మాత్రం రాబట్టగలుగుతుంది.ఈ సినిమాకు దాదాపు 40 కోట్ల వరకు బడ్జెట్... అయింది. 140 కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు తీసుకువచ్చింది f3. ఇలా ఒక సినిమా సక్సెస్ అయితే మరొక సినిమా పెద్దగా.. ఆడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: