అయితే ఆ సినిమాకు సిక్వెల్గా వచ్చిన మూవీ 'బంగార్రాజు' జనవరి-2022 లో విడుదల అయింది.అసలు కథానాయకుడు నాగార్జున తన పాత్రను తిరిగి పోషించిన తర్వాత ఈ సీక్వెల్‌కు బంగార్రాజు అని పేరు పెట్టారు.రమ్యకృష్ణ కూడా సత్యభామ పాత్రలో నటించి అలరించింది.నాగార్జున కుమారుడు నాగ చైతన్య బంగార్రాజు మనవడు చిన బంగార్రాజుగా నటించి మంచి మార్కులు కొట్టారు.హీరోయిన్గా నాగ లక్ష్మి పాత్రలో కృతి శెట్టి కూడా తన వంతు పాత్రతో కేక పెట్టించింది. కురసాల ప్రకారం, బంగార్రాజు ఒక తాజా కథాంశాన్ని కలిగి ఉన్నాడు మరియు అది సీక్వెల్ అయినప్పటికీ దాని స్వంతదానిపై నిలబడింది. ఈ సినిమాలో నాగార్జున రెండో కొడుకు అఖిల్ అక్కినేనిని నటింపజేయాలని కురసాల ప్లాన్ చేశాడు కానీ షెడ్యూల్ గొడవల కారణంగా అది కార్యరూపం దాల్చలేదని అన్నారు.
అయితే కధ విషయానికి వస్తే 'సోగ్గాడే చిన్ని నాయనా' కథ ఎక్కడ ముగిసిందో అక్కడ ఈ సినిమా మొదలు అవుతుంది. చిన బంగార్రాజుకి వరసకు మరదలు అయ్యే నాగలక్ష్మితో పెళ్లి చేయాలని సత్యభామ అనుకోవడం అయితే చిన్నప్పటి నుంచి చిన్న బంగార్రాజు, నాగలక్ష్మి ఎప్పుడూ గొడవ పడుతూ ఉండడం చిన్ననాటి నుండే నాన్నమ్మ దగ్గరే పెరిగిన చిన బంగార్రాజు సైతం తాత బంగార్రాజు పోలికలతో ఊరిలో అమ్మాయిలతో సందడి చేస్తున్న క్రమంలో సత్యభామ హఠాన్మరణం చెంది స్వర్గంలో ఉన్న భర్త బంగార్రాజు చెంతకు చేరుతుంది.
అప్పటికే శివపురం శివాలయంలో ఉన్న గుప్తనిధిపై దుష్టశక్తుల కన్నుపడుతుంది.ఆ దేవాలయాన్ని బంగార్రాజు కుటుంబం తరాలుగా రక్షిస్తుంటుంది. చిన్న బంగార్రాజు అడ్డు తొలగించుకుంటేనే తమకు ఆ నిధి దొరుకుతుందని సంపత్ కుట్ర పన్నడంతో అదే సమయంలో స్వర్గంలో ఉన్న బంగార్రాజు, సత్యభామ మనవడిని రక్షించడానికి పూనుకొని ఇంద్రుడు సూచనల మేరకు భూలోకానికి వస్తారు.చిన్న బంగార్రాజు, నాగలక్ష్మిని కలపడం కోసం పెద్ద బంగార్రాజు ఏం చేశాడు? భూలోకం వచ్చిన తర్వాత మనవడికి ఎదురైన ఆపదను ఎలా తప్పించాడు? గుడి నిధులను ఎలా కాపాడాడు అని చూపించడంలో దర్శకుడు మార్క్ స్పష్టంగా కనబడింది దాంతో ఫ్యామిలీ ప్రేక్షకులు వరుస థియేటర్ ల బాట పట్టారు.