మన ఇండియన్ హిస్టరీలోనే మనకు తెలియని విషయాలు చాలానే ఉంటాయి.. అలా ఎంతోమంది వీరుల దీరుల కథలు మన అప్పుడప్పుడు చదువుతూనే ఉంటాము. అయితే కొన్ని దశాబ్దాల క్రితం కోట్ల రూపాయలు తీసుకున్న సింగర్ ఉందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.. అంతేకాకుండా వేశ్యగా కూడా సంగీతంలో చాలా విజయాలను సాధించింది ఆమె. ఆమె ఎవరో కాదు గౌహార్ జాను.. కేవలం 13 సంవత్సరాల వయసులోనే లైంగిక వేధింపులను కూడా ఎదుర్కొన్నదట. ఈమె హిందూ శాస్త్రీయ సంగీతంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నదట.


గౌహర్ తనకు ఎదురైన లైంగిక వేధింపుల నుంచి కోలుకోవడానికి సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిందట. తన బాల్యం నుంచి పోరాటం మరియు కష్టాలతోనే చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. తన బాల్యాన్ని మొత్తం వ్యభిచార గృహంలో కూడా గడిపిందట. ఇండియన్ మొట్టమొదటి మహిళా రికార్డింగ్ కళాకారునిగా గ్రామోఫోన్ కంపెనీతో ఇమే మొదటి రికార్డింగ్ చేయబడినట్లు సమాచారం. ఈమె సంగీతానికి నాంది పలికింది కూడా అక్కడే నట. ఆ సమయంలో అత్యధిక సంగీత కళాకారునిగా పేరుపొందింది గౌహార్ జాను.


1902 లో పాటను రికార్డు చేసిన ఫస్ట్ ఇండియన్ గాయకురాలుగా చరిత్రలు నిలిచింది. ఈమె మొదటి పాట కూడా వేశ్యల పోరాటాల గురించి రికార్డు చేసిందట అక్కడినుంచి ఈమె మార్పు మొదలయ్యిందని సమాచారం. ఈమె కోలకత్తాలో రాబర్ట్ విలియం, విక్టోరియా హెమ్మింగ్స్ దంపతులకు జన్మించిందట అయితే ఈమె తల్లి కూడా గాయనిగా ఉండేదట.. అయితే తన తండ్రి మాత్రం తన కూతురిని అలా చేయడానికి ఒప్పుకోలేదట దీంతో ఆమెను చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరు వదిలేసారట. బయటికి వచ్చిన తర్వాత గాయనిగా పేరు సంపాదించిన గౌహర్జా భారీ బంగారు వెండి ఆభరణాలను ధరిస్తూ ఉండేదట. ఈమె ఇండియన్ మొదటి మిలీనియర్ గాయకురాలుగా కూడా పేరు సంపాదించింది. అప్పట్లో ఏకంగా పది భాషలలో 600 పాటలకు పైగా రికార్డు చేసిందట ఒక్కో పాటకి 3000 రూపాయలు తీసుకునేదట. అప్పట్లోనే ఏమిటి సొంతంగా ఒక రైలు కూడా ఉండేదట. ఆ రైలులోనే ఎక్కడికైనా ప్రయాణిస్తూ వెళ్లేదట. కాని చివరి రోజుల్లో ఈమె పేదరికంతో జీవించి చివరికి మైసూరులో మరణించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: