ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ పారితోషకాన్ని అంతకంతకు పెంచేస్తూ ఉండడం చూస్తున్నాం అన్న విషయం తెలిసిందే. ఒక్క హిట్ సినిమా పడింది అంటే చాలు ఇక నిర్మాతలకు అందుబాటులో లేని విధంగా పారితోషకాన్ని పెంచేస్తున్నారు. కొంతమంది హీరోలు అయితే తమ మార్కెట్ ని కూడా ఆలోచించకుండా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే అందరి హీరోలు ఏమో కానీ బాలయ్య విషయంలో మాత్రం అలా ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే పారితోషకం గురించి ఆలోచించకుండానే ఆయన కెరియర్ మొత్తం సినిమాలు చేస్తూ వచ్చారు.


 నిర్మాతల గురించి ఆలోచిస్తూ తక్కువ పారితోషకమే తీసుకుంటూ అందరికీ అందుబాటులో ఉన్నారు బాలయ్య. ఇప్పటివరకు ఏకంగా సినిమాల విషయంలో సెంచరీ కొట్టిన బాలయ్య రెమ్యూనరేషన్ మాత్రం సెంచరీకి దగ్గరలో కూడా లేదు. ఇలా తక్కువ పారితోషకంతో అందరికీ అందుబాటులో ఉండే అసలైన అందరివాడు అని పేరు సంపాదించుకున్నాడు ఈ నందమూరి హీరో. గోపీచంద్ మలినేని తో చేసిన వీర సింహారెడ్డికి బాలయ్య తీసుకుంది కేవలం 14 కోట్లే. అంటే నేటి రోజుల్లో ఒక మిడ్ రేంజ్ హీరో తీసుకునే పారితోషకం కంటే తక్కువ. ఈ మూవీ అప్పట్లో 140 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.


 ఇక బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన భగవంతు కేసరి సినిమాకి కూడా 18 కోట్ల తీసుకున్నాడట బాలయ్య. ఇక ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఎన్బికే 109 సినిమాకి మాత్రం 30 కోట్ల తీసుకుంటున్నాడట. కాగా ఇటీవల అఖండ 2 పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే మొదటిసారి ఈ సినిమా కోసం బాలకృష్ణ తన కెరియర్ లోనే హైయెస్ట్ పారితోషకం అందుకుంటున్నడు అని తెలుస్తుంది. ఏకంగా అఖండ మూవీ సీక్వెల్ కోసం 50 నుంచి 54 కోట్ల వరకు బాలకృష్ణ పారితోషకం తీసుకుంటున్నాడట. ఇదే నిజమైతే మాత్రం బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ పారితోషికం అందుకోవడమే కాదు.. ఇక ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది హీరోలను దాచేసినట్టే అని సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: