నేటి రోజుల్లో సోషల్ మీడియా అనే మాయలోనే ప్రపంచం మొత్తం మునిగి తేలుతుంది అన్న విషయం తెలిసిందే. అబ్బే అదేం లేదండి అని ఎవరు ఎంత చెప్పినా ఇక ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ ని తెగవాడేస్తూ సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ని పొందుతున్నారు అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే కొంతమంది సోషల్ మీడియాలో కేవలం ఎంటర్టైన్మెంట్ పొందాలి అని మాత్రమే అనుకుంటుంటే.. ఇంకొంతమంది ఎంటర్టైన్మెంట్ పంచాలి అనుకుంటున్నారు. అదేనండి ఏదో ఒకటి చేసి పాపులారిటీ సంపాదించి ఫాలోవర్లను పెంచుకోవాలని భావిస్తున్నారు.


 ఇక ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి వెరైటీగా ట్రై చేస్తే గాని సోషల్ మీడియాలో పాపులారిటీ రావడం లేదు. దీంతో అందరిలా ట్రై చేయడం కాదు. తాము ఏదో కొత్తగా ప్రయత్నించాలి అనుకొని కొన్ని కొన్ని సార్లు చిత్ర విచిత్రమైన పనులు చేయడానికి కూడా సిద్ధమైపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలా సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొంతమంది చేస్తున్న వింత ప్రయత్నాలకు సంబంధించిన వీడియోలు కూడా అటు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూసి ఇంటర్నెట్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఒక యువకుడు పియానో వాయిస్తూ ఉన్నాడు. కానీ అతను వాయించే విధానం మాత్రం విచిత్రంగా విడ్డూరంగా ఉంది. అతని తల మీద సిలిండర్ ఉంది. అతని మెడకు ఒక మంచం గ్యాస్ స్టవ్ కట్టేసి ఉన్నాయి. ఆ మంచానికి నలువైపులా రకరకాల ఈ వంటింటి పాత్రలు కట్టేసి ఉన్నాయి. అలాగే పలు బాటిల్స్ మగ్గు కూడా మెడలో వేసుకున్నాడు. ఇలా విచిత్రమైన వేషధారణలో ఉండి గ్యాస్ స్టవ్ ను హార్మోనియంలా భావిస్తూ దానిని వాయిస్తూ డాన్స్ చేస్తున్నాడు. ఇలా చేసి సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవాలనుకున్నాడు. అయితే ఇది చూసి నెటిజెన్స్ అందరు షాక్ అవుతూ ఆ తర్వాత కాసేపు నవ్వుకుంటున్నారు కూడా. https://www.instagram.com/reel/C_KAGM5SZNv/?igsh=MXFneXZlMmJla2NiaA==

మరింత సమాచారం తెలుసుకోండి: